ఆ క్రైటీరియాలో వర్జున్ తేజ్ కూడా వచ్చినట్లే తెలుస్తోంది. వరుణ్ తేజ్ ప్రయోగాత్మక చిత్రాలతో
ఫిబ్రవరి నెలలో మంచి సినిమాలు వచ్చినప్పటికీ కలెక్షన్స్ పెద్దగా రాలేదు. సాధారణంగా ఫిబ్రవరి సినిమాలకు బాగా కలెక్షన్స్ రావని చెబుతూ ఉంటారు. అందుకే చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఆ నెలలో సక్సెస్ అవుతూ ఉంటాయి. ఇక మార్చి నెలలో సినిమాలు చూడడానికి జనం ఎగబడతారని ఆశిస్తూ ఉంటారు. అందుకే ఎక్కువ రిలీజ్ లను ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ నెలలో మొదటి వారం వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ విడుదలైంది. అయితే వరుణ్ తేజ్ సినిమాకు వచ్చే కలెక్షన్స్ ఈ సినిమాకు మొదటి రోజు రాకపోవడం కాస్త ఆందోళన కలిగిస్తూ ఉంది. ఏకంగా వరుణ్ తేజ్ కెరీర్ రిస్క్ లోనే ఉందేమో అనే అనుమానాలు కలిగిస్తూ ఉన్నాయి కలెక్షన్స్.
యువ హీరోలందరూ హై-బడ్జెట్ పాన్-ఇండియన్ సినిమాలు చేయడంలో పూర్తిగా బిజీగా ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఫ్లాప్‌లను పొందుతున్నారు. మంచి కలెక్షన్స్.. లేదా రివ్యూలను కూడా గొప్పగా పొందలేరు. ఆ క్రైటీరియాలో వర్జున్ తేజ్ కూడా వచ్చినట్లే తెలుస్తోంది. వరుణ్ తేజ్ ప్రయోగాత్మక చిత్రాలతో వరుసగా పరాజయాలను చవిచూస్తున్నాడు. వరుస ఫ్లాప్ లను పొందుతున్న వరుణ్ తేజ్ కు ఆపరేషన్ వాలెంటైన్ ఓపెనింగ్ నంబర్లు కూడా పెద్దగా లేకపోవడంతో కాస్త ఆందోళన కనిపిస్తోంది. ఆపరేషన్ వాలెంటైన్ కు మంచి పాజిటివ్ రివ్యూలు వచ్చినా కూడా థియేటర్లలో ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉంది. మొదటి రోజు మార్నింగ్ షో, మ్యాట్నీకి చాలా తక్కువగా కలెక్షన్స్ వచ్చాయి.. ఆ తర్వాత ఫస్ట్ షో, సెకండ్ షోకు కలెక్షన్స్ రావడం మొదలయ్యాయి. ఒక సమయంలో, వరుణ్ తేజ్ తన చిత్రాలలో చాలా ప్రామిసింగ్‌గా కనిపించాడు. చాలా మంచి థియేట్రికల్ బిజినెస్ కూడా అతడి సినిమాలు చేశాయి. ఇప్పుడు థియేట్రికల్ రన్ విషయంలో అతడి సినిమాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అతని సినిమాలు మంచి ఓపెనింగ్ నంబర్లు రాబట్టడంలో విఫలమవుతున్నాయి. కనీసం మొదటిరోజు 5 కోట్లు కూడా వసూలు చేయడం లేదు.