మెగా ఫ్యామిలీలో పెళ్ళి బాజాలు మోగ బోతున్నాయి , నాగబాబు(Naga babu) కుమారుడు.. టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) పెళ్లికి అన్ని ఏర్పాట్లు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. వీరి ప్రేమ పెళ్లికి సన్నాహాలు స్వయంగా వీరే చేసుకోవడం కోసం.. పెళ్ళికి వారం రోజుల ముందే ఇటలీ బయలు దేరారు జంట.

మెగా ఫ్యామిలీలో పెళ్ళి బాజాలు మోగ బోతున్నాయి , నాగబాబు(Naga babu) కుమారుడు.. టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పెళ్లికి అన్ని ఏర్పాట్లు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. వీరి ప్రేమ పెళ్లికి సన్నాహాలు స్వయంగా వీరే చేసుకోవడం కోసం.. పెళ్ళికి వారం రోజుల ముందే ఇటలీ బయలు దేరారు జంట. త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు ఇద్దరు టాలీవుడ్ స్టార్స్. నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలోని టుస్కానీలో ఉన్న బోర్గో శాన్ ఫెలైస్ రిసార్ట్ లో అత్యంత ఘనంగా పెళ్ళి చేసుకోబోతున్నారు. అయితే ఈ వేడుకలకు సబంధించిన ఏర్పాట్లను మెగా కోడులు ఉపాసన స్వయంగా పర్యావేక్షించబోతున్నారు.

పెళ్లికి వారం ముందే వరుణ్ తేజ్, లావణ్య టుస్కానీ(Tuscany) బయల్దేరి వెళ్లిపోయారు. వారితో పాటు ఉపాసన కూడా అక్కడికి వెళ్ళారు. వరుణ్ తేజ్ ఇటలీ వెళ్తున్నట్టుగా.. విమానంలో విండో నుంచి తీసిన ఫొటోని తన ఇన్ స్టా గ్రామ్(Instagram) పేజ్ లో షేర్ చేశాడు. ఈ జంటకు తోడుగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని కూడా టుస్కానీ చేరుకున్నారు. డబుల్ రెయిన్ బో , టుస్కానీ అంటూ ఆమె ఒక ఫోటోని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

నవంబర్ 1న టుస్కానీలో జరిగే ఈ వివాహానికి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగబాబు ఇలా మెగా ఫ్యామిలీ తరఫున అన్ని కుటుంబాలు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. హాల్దీ, మెహెందీ, సంగీత్, వివాహం ఇలా నాలుగు రోజుల పాటు పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగబోతోంది. అంతే కాదు అదుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక ఈ పెళ్లి తరువాత అటు నుంచి అటే కొత్త జంట హనీమూన్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారట. పెళ్లి తర్వాత వరుణ్, లావణ్య నెల రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యటించనున్నారు.

Updated On 22 Oct 2023 5:40 AM GMT
Ehatv

Ehatv

Next Story