గత రెండు మూడేళ్ళ నుండి సోషల్ మీడియా లో వరుణ్ తేజ్(Varun Tej) మరియు లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) గురించి ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరు కాల్షిప్ ‘మిస్టర్’(Mister) మరియు ‘అంతరిక్షం’(anthariksham) వంటి సినిమాలలో నటించారు.
మెగావారింట పెళ్ళి బాజాలు మోగనున్నాయా..? వరుణ్ తేజ్ ప్రేమ వ్యవహారం నిజమేనా..? ఈనెలలోనే ఎంగేజ్మెంట్ కూడా జరగబోతోందా. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత..?
చాలా కాలంగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని వరుణ్ తేజ్ ప్రేమిస్తున్నాడని.. వారు చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ టాలీవుడ్, సోషల్ మీడియా తో పాటు.. మీడియా సంస్థలు అన్నింటిలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలు వైరల్ అవుతున్నా.. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ స్పందించలేదు.
ముఖ్యంగా ఈ విషయంలో వరుణ్ కానీ, లావణ్య గానీ ఇప్పటి వరకూ ఖండించలేదు క్లారిటీ ఇవ్వలేదు. ఏ విషయం ఎంత చిన్నదైనా... తన యూట్యూబ్ ద్వారానో.. సోషల్ మీడియా ద్వారాలో.. స్పందిస్తూ.. వివరణ ఇస్తూ.. తన మార్క్ కామెంట్స్ తో రెచ్చిపోయే నాగబాబు కూడా ఈ విషయంలో కామ్ గానే ఉన్నాడు. దాంతో నిజంగానే వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఆడియన్స్ అంతా చెవులు కొరుకుంటున్నారు. ఈ విషయంలో గతంలో వైరల్ అయ్యింది. ఆతరువాత కాస్త కామ్ అయినా.. ఇఫ్పుడు మళ్లీ వరుణ్ తేజ్ పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. మెగా ప్రిన్స్ వరుణ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 9వ తేదీన హీరోయిన్ లావణ్యతో వరుణ్ ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. అయితే ఈ విషయానికి సంబంధించి పక్కా కథనాన్ని ప్రముఖ పత్రిక ఇండియా టుడే తన కథనంలో వెల్లడించింది. ఈ విషయాన్ని మెగా కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు పేర్కొంది. హైదరాబాద్‌లోని నివాసంలో కాని ఫంక్షన్ హాలులో వీరి నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు తెలిపింది.
అంతే కాదు మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ ఏడాదిలోనే వీరి పెళ్లి కూడా జరిపించాలని పెద్దలు నిశ్చయించినట్టు ఈ కథనంలో వివరించింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా హాజరవుతారని సమాచారం. చిరంజీవి, పవన్ కల్యాణ్ తో పాటు.. రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.వీరితో పాటు మెగా యూత్ సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్,సుష్మిత, అంతా సందడి చేస్తారని సమాచారం.
ఇక ఈ న్యూస్ విని మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ విషయంతో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నారు. మరి ఇది నిజం అయితే.. ఏదైనా అనౌన్స్ మెంట్ మెగా ఫ్యామిలీ నుంచి చేస్తారా..? లేక గుట్టు చప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ చేస్తారా అనేది చూడాలి.