మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. అయితే ఆయన ప్రస్తుతం గాండీవధారి (Gandeevadhari Arjuna) అర్జున అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‏లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రీసెంట్‏గానే రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రూపొందుతున్నట్టు తెలుస్తోంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. అయితే ఆయన ప్రస్తుతం గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna) అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‏లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రీసెంట్‏గానే రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రూపొందుతున్నట్టు తెలుస్తోంది.ఈ చిత్రం ఎప్పుడు విడుదల చేస్తున్నారన్నదానిపై మాత్రం ఇంకా అనౌన్స్‏మెంట్ చేయలేదు. ఇక VT13లో వరుణ్ ఇండియన్ ఎయిర్‏ఫోర్స్ పైలెట్‏గా కనిపించబోతున్నాడు. 2017 మిస్ యూనివర్స్ భామ మానుషి చిల్లార్ (Manushi Chhillar) ఈ చిత్రంలో నటించనుంది.

సామ్రాట్ పృథ్విరాజ్ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్‏లో కనిపించనున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ VT13 చిత్రంతో ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హదా (Shakti Pratap Singh Hada) దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి గురించి చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సోషల్ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలకు కలిసి వెళ్లేవారు. ఆ తర్వాత రూమర్స్ బాగా ఎక్కువవుతుండటంతో కొంతకాలం వాటిని ఖండిస్తూ వచ్చారు ఈ జంట. ఇక తాజా ఈ రూమర్స్‏కు వీళ్లిద్దరూ చెక్ పెట్టేశారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కబోతోంది.. అవును మీరు విన్నది నిజమే.. వెరీ సూన్ వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు.

ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ చిత్రంలో కలిసి నటించారు. అంతకంటే ముందు మిస్టర్ అనే చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. గతంలో ఓ కామన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో వరుణ్ తేజ్, లావణ్య కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పార్టీలో సాయి ధరమ్ తేజ్, నితిన్-షాలిని, నిహారికలు ఉన్నారు.ఇక జూన్‏లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నిశ్చితార్ధం జరగనుండటంతో అందరి దృష్టి వీళ్లపైనే ఉంది. ఈ ఏడాది చివరిలో ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో వీళ్ల పెళ్లి జరగనుందని సమాచారం. ఈ అందమైన జంట పెళ్లి కోసం అభిమానులు అంతా వేచి చూస్తున్నారు.

Updated On 17 May 2023 3:23 AM GMT
Ehatv

Ehatv

Next Story