హీరోయిన్ వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) తెలుసు కదా! పుష్పక విమానంలో తళుక్కుమని మెరిసిన ఈ తార మాతృభాష కన్నడే అయినా తమిళ, మలయాళ సినిమాల్లో మంచి పేరు సంపాదించుకుంది. లేటెస్ట్‌గా ఆమె నటించిన ఊరు పేరు భైరవకోన(Ooru Peru Bhairavakona) ఈ నెల 16వ తేదీన విడుదల కాబతున్నది. ఇందులో సందీప్ కిషన్(Sandeep Kishan) హీరో. కావ్యా థాపర్(Kavya Thappar) కూడా ఇందులో ఓ హీరోయిన్! వీఐ ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించారు.
హీరోయిన్ వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) తెలుసు కదా! పుష్పక విమానంలో తళుక్కుమని మెరిసిన ఈ తార మాతృభాష కన్నడే అయినా తమిళ, మలయాళ సినిమాల్లో మంచి పేరు సంపాదించుకుంది. లేటెస్ట్‌గా ఆమె నటించిన ఊరు పేరు భైరవకోన(Ooru Peru Bhairavakona) ఈ నెల 16వ తేదీన విడుదల కాబతున్నది. ఇందులో సందీప్ కిషన్(Sandeep Kishan) హీరో. కావ్యా థాపర్(Kavya Thappar) కూడా ఇందులో ఓ హీరోయిన్! వీఐ ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా వర్ష బొల్లమ్మ మీడియాతో ముచ్చటించింది. పాత్ర నిడివి తనకు ఇంపార్టెంట్ కాదని, ప్రాముఖ్యత ఉన్న ఏ పాత్రనైనా పోషిస్తానని చెప్పింది. ఇప్పటి వరకు తాను చేసిన పాత్రలన్నీ అలా ఎంచుకున్నవేనని తెలిపింది. ఊరు పేరు భైరవకోన సినిమాలో తాను ట్రైబల్ అమ్మాయి భూమి పాత్రలో కనిపిస్తానని, తన ఊర్లో చదువుకున్న అమ్మాయి ఒక్క భూమి మాత్రమేనని, అందంగా, అమయాకంగా కనిపించే ఈ పాత్రలో స్ట్రెంత్, పవర్ ఉన్నాయని పేర్కొంది. ఈ సినిమాలో ఉన్న సందేశం కూడా తన పాత్రతోనే వస్తుందని, తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌కు భూమి పాత్ర కాస్త దగ్గరగా అనిపించిందని వివరించింది. దర్శకుడు వీఐ ఆనంద్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు అలా ఎలా ఆలోచించి కథలు రెడీ చేస్తారు? అని అనుకున్నానని చెబుతూ కథ అంత బాగా అనిపించిందని తెలిపింది. ప్రస్తుతం తమిళ, తెలుగు, మలయాళంలో సినిమాలు చేస్తున్నానని వివరించింది. గతంలో స్వాతిముత్యం సినిమాలో నాతో కలిసి నటించిన బెల్లంకొండ గణేశ్‌తో(Bellamkonda ganesh) ప్రేమలో పడ్డాననే వదంతులు వ్యాపించాయి. త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామనే కథనాలు సోషల్ మీడియాలో వచ్చాయి. వాటిల్లో ఏ మాత్రం నిజం లేదు. మేమిద్దరి మంచి ఫ్రెండ్స్. అయినా ఇద్దరం కలిసి బయట తిరిగితే ఇలాంటి న్యూస్ వస్తే నమ్మొచ్చు. అసలు మేమిద్దరం ఒకరి గురించి ఒకరం మాట్లాడుకోనే లేదు. నేను ఏదైనా పోస్ట్ చేస్తే దానికి అతడు రియాక్ట్ అయితేనో, అతడి పోస్టులకు నేను రియాక్ట్ అయితేనో అనుకోవచ్చు. మా మధ్యలో ఇలాంటివి ఏమీ జరగకుండానే ఆ వార్తలు రావడం చూసి షాకయ్యాను. నిజం చెప్పాలంటే బెల్లంకొండ గణేశ్ మంచి మనిషి. మంచి ఫ్రెండ్. అంతే ' అని వర్ష బొల్లమ్మ తెలిపింది.