వరలక్ష్మి శరత్‌కుమార్(Varalakshmi sharath Kummar) ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగల నటి. ఛాలెంజింగ్ రోల్స్ అంటే ఆమకు మహా ఇష్టం. శరత్‌కుమార్ కూతురైనప్పటికీ స్వశక్తితోనే నటిగా ఎదిగారు వరలక్ష్మి. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకున్నారు. హీరోయిన్ పాత్రలకే ఆమె పరిమితం కాలేదు. నటనకు స్కోప్ ఉండాలే కానీ ప్రతినాయకి పాత్రనైనా నిర్మోహమాటంగా ఒప్పేసుకుంటారు.
వరలక్ష్మి శరత్‌కుమార్(Varalakshmi sharath Kummar) ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగల నటి. ఛాలెంజింగ్ రోల్స్ అంటే ఆమకు మహా ఇష్టం. శరత్‌కుమార్ కూతురైనప్పటికీ స్వశక్తితోనే నటిగా ఎదిగారు వరలక్ష్మి. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకున్నారు. హీరోయిన్ పాత్రలకే ఆమె పరిమితం కాలేదు. నటనకు స్కోప్ ఉండాలే కానీ ప్రతినాయకి పాత్రనైనా నిర్మోహమాటంగా ఒప్పేసుకుంటారు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో వచ్చిన పోడాపోడి సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు వరలక్ష్మి. అందులో శింబు(Shimbu) సరసన నటించారు. ఆ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అవకాశాల కోసం కొంతకాలం ఎదురుచూడాల్సి వచ్చింది.
బాల దర్శకత్వంలో వచ్చిన తారై తప్పటై సినిమాతో వరలక్ష్మి తానేమిటో రుజువు చేసుకున్నారు. ఇండస్ట్రీ దృష్టి ఆమెపై పడింది. ఆ తర్వాత ఆమె మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. నటుడు విజయ్ హీరోగా నటించిన సర్కార్, విశాల్(Vishal) హీరోగా నటించిన సండై కోళీ 2 వంటి చిత్రాల్లో వాంప్ రోల్స్‌లో అద్భుతంగా నటించారు. అటు తర్వాత వరలక్ష్మికి ఇలాంటి పాత్రలే రావడం మొదలు పెట్టాయి. తమిళంలోనే కాదు, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా మరలక్ష్మి నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాలో జెనీలియా(Genelia) నటించిన పాత్రను వరలక్ష్మి చేయాల్సి ఉంది.
కొద్దిలో ఆ అవకాశం చేజారింది. ఈ విషయాన్ని వరలక్ష్మే స్వయంగా చెప్పారు. 'దర్శకుడు శంకర్ నుంచి నాకు పిలుపు వచ్చింది. ఆడిషన్, స్క్రీన్ టెస్ట్ కూడా జరిగాయి. ఆ చిత్రంలో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్న సమయంలో నాన్న శరత్‌కుమార్ నాకు నటించడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత బాలాజీ శక్తి వేల్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రంలోనూ కథానాయికగా నటించే అవకాశం వచ్చింది. దాన్ని కూడా నాన్న వద్దన్నారు. ముందు చదువు పూర్తి చెయ్యి ఆ తర్వాత నటన గురించి ఆలోచిద్దామని చెప్పారు. అలా నాన్న కారణంగా చాలా అవకాశాలు మిస్ అయ్యాను' అని వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పుకొచ్చారు.