సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఓ దర్శకుడితో సినిమా చేయబోతున్న కొద్ది రోజుల క్రితం ఓ వార్త గుప్పుమంది. అయితే ఇప్పుడు ఆ వార్త నిజమయ్యే అవకాశాలు ఎక్కువశాతం కనిపిస్తున్నాయి. అప్పట్లో లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని చాలామంది భావించారు. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత టాలీవుడ్‏లో ఓ పెద్ద డైరెక్టర్‏తో రజినీ సినిమా ఉంటుందంటున్నారు.

గత జనవరిలో వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన కేఎస్ రవీంద్ర (K.S.Ravindra-Bobby) (బాబీ) సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)‏తో సినిమా చేయబోతున్నారట. మాస్ ఎంటర్‏టైనర్ సినిమాలు తీయడంతో స్పెషలిస్టు అయిన ఇతను రజినీ కాంత్‏ను వింటేజ్ మాస్ క్యారెక్టర్‏లో చూపించే స్క్రిప్ట్ రాసుకున్నారట. జైలర్ (Jailer) షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్‏పైకి వెళ్లనుందని.. అందుకు తగ్గట్టు సన్నాహాలు చేస్తున్నట్టు.. అన్నీ కుదిరాక అఫిషియల్ అనౌన్స్‏మెంట్ చేద్దామని భావిస్తున్నారట మేకర్స్.

ఇప్పటికే బాబీ చిరంజీవి(Chiranjeevi)తో బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఇప్పుడు రజినీతో చేయబోయే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం రజినీకాంత్ (Rajinikanth) జైలర్ చిత్రంలో చేస్తున్నాడు. ఈ మూవీలో తమన్నా, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 13 April 2023 4:16 AM GMT
Ehatv

Ehatv

Next Story