పేరుకు చిన్న నటి కానీ వరద బాధితుల కోసం పెద్ద మనుసు చాటుకుంది.

పేరుకు చిన్న నటి కానీ వరద బాధితుల కోసం పెద్ద మనుసు చాటుకుంది. పెద్ద పెద్ద స్టార్లు కోట్లకు కోట్లు పారితోషికాలు తీసుకొని సైలెంట్‌గా ఉండే కొందరు లేదా పదో పరకో ఇచ్చి చేతులు దులుపుకునే రకం కొందరు ఉన్న ఈ రోజుల్లో తనకు పెద్ద సినిమా అవకాశాలు లేకున్నా, ఒకటో రెండో సినిమాల్లో అవకాశాలు వచ్చినా పెద్ద రెమ్యునరేషన్‌ లేకున్నా కానీ తనకు తోచినంత సాయం చేసి పెద్ద మనసు చాటుకుందీ చిన్న నటి. తనే అనన్య నాగళ్ల(Ananya Nagalla). పలు చిన్న సినిమాల్లో నటించిన అనన్య నాగళ్లకు పవన్‌ కల్యాణ్‌తో(Pawan kalyan) నటించిన వకీల్ సాబ్‌(Vakeel saab) సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పుడు తెలంగాణ, ఏపీలో వరదలతో(Floods) ప్రజలు ఇబ్బందులో పడుతుంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రెండున్నర లక్షల రూపాయల విరాళం ప్రకటించి అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. ఈ మేరకు తను సోషల్‌ మీడియాలో(Social media) ఓ పోస్ట్‌ చేసింది. ఇందులో' రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరలోనే ఈ విపత్తు నుంచి మన రాష్ట్రాలు కోలుకోవాలని కోరుకుంటూ, వరద నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 2.5 ల‌క్ష‌లు విరాళం గా ప్రకటిస్తున్నాను`` అని తెలిపింది.

Eha Tv

Eha Tv

Next Story