ఆనంద్ దేవరకొండ(Anand Devarkonda), విరాజ్ అశ్విన్(Viraj Ashwin), వైష్టవి చైతన్య(vaishnavi chaithanya) ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ. సాయి రాజేశ్(Sai Rajesh) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 14న థియేటర్లలో విడుదల కాబోతున్నది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్(Pre-Release Event) వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య భావోద్వేగానికి గురయ్యారు. వేదికపైనే కంటతడి పెట్టుకున్నారు.

Vaishnavi Chaithanya
ఆనంద్ దేవరకొండ(Anand Devarkonda), విరాజ్ అశ్విన్(Viraj Ashwin), వైష్టవి చైతన్య(vaishnavi chaithanya) ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ. సాయి రాజేశ్(Sai Rajesh) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 14న థియేటర్లలో విడుదల కాబోతున్నది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్(Pre-Release Event) వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య భావోద్వేగానికి గురయ్యారు. వేదికపైనే కంటతడి పెట్టుకున్నారు. దర్శకుడు సాయి రాజేశ్(Sai Rajesh) నటిగా తనకు పునర్జన్మ ఇచ్చారంటూ ఎమోషనల్ అయ్యారు. ఆమె హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా(Debute Movie) ఇదే కావడం విశేషం. వేదిక మీద వైష్ణవి మాట్లాడుతూ ' యూట్యూబ్ వీడియోలు చేసుకునే నాకు బేబీ సినిమాలో అవకాశం ఇచ్చారు. నాకంటే ఎక్కువగా నన్ను నమ్మి ముందుకు నడిపించారు దర్శకుడు రాజేశ్.
ప్రధాన హీరోయిన్ పాత్ర చేయాలన్నదే నా లక్ష్యం. అయితే మధ్యలో సహాయ నటిగా సినిమాల్లో చేశాను. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారాను. ఈ అమ్మాయి యూ ట్యూబర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి మెయిన్ లీడ్ రోల్ చేయలేదని చాలా మంది అన్నారు. బేబీలో(Baby) అవకాశం రాగానే ఈ పాత్ర నేను చేయగలనా అన్న భయం వేసింది. కానీ దర్శకుడు రాజేశ్ నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఈ విషయంలో నాకు మరో జన్మ ఇచ్చారు. అందువల్లే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాను. నిర్మాత ఎస్‌కేఎన్(Producer SKN) కూడా నన్ను ఓ బేబీలా చూసుకున్నారు' అంటూ కంటతడి పెట్టుకున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు.
