బేబీ(Baby) సినిమాతో అటు హీరోయిన్ కు ఇటు డైరెక్టర్ కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. అంతే కాదు.. నిర్మాతగా.. ఎస్కేఎన్ మంచి పేరు తెచ్చుకున్నారు.. అటు ఆనంద్ దేవరకొండ(Anand Devarkonda) ఇమేజ్ కూడా అమాంతం పెరిగింది. ఇక తాజా సమాచారం ప్రకారం బేబీ కాంబోలో మరో సినిమారాబోతుందట మరి.

వైష్ణవీ చైతన్య(Vaishnavi chaithanya) .. ఇప్పుడు ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. 'బేబి' సినిమాతో తను స్టార్ డమ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తరువాత ఆమెను వరుస ఆఫర్లు చుట్టుముట్టాయి. తనకి నచ్చిన కథలను ఆమె ఎంచుకుంటూ వెళుతోంది. అలా తాజాగా ఆమె మరోసారి ఆనంద్ దేవరకొండ జోడీగా 'డ్యూయెట్'(Duet) అనే సినిమా చేయడానికి ఆమె ఒప్పుకుందని టాక్.

ఆనంద్ దేవరకొండ హీరోగా మిథున్(Mithun) అనే కుర్ర దర్శకుడు.. పరిచయం అవుతూ.. ఒక లవ్ స్టోరీ మూవీ రూపొందించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన క్యారెక్టర్ కోసం.. ఇప్పటికే చాలామంది పేర్లను పరిశీలించారు. చివరికి వైష్ణవీ చైతన్య అయితేనే ఆ పాత్రకి కరెక్టుగా సెట్ అవుతుందని భావించి, ఆమెను ఎంపిక చేసినట్టుగా సమాచారం.

నిజానికి ఈ కాంబినేషన్లో 'బేబి' నిర్మాతలే మరో సినిమా చేయాలని భావించారు. కానీ సరైన కథ సెట్ కాకపోవడం వలన, అందుకు సంబంధించిన పనులలోనే ఉన్నారు. ఈలోగానే మిథున్ దర్శకత్వంలో ఈ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది యూత్ ఫుల్ లవ్ స్టోరీ అని అంటున్నారు. దసరాకి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. మరి ఈసారి ఈసినిమా కనుక హిట్ అయితే.. ఈ ఇద్దరు స్టార్ల ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయే అవకాశం లేకపోలేదు.

Updated On 10 Oct 2023 5:46 AM GMT
Ehatv

Ehatv

Next Story