బ్లాక్ బస్టర్ చిత్రం ఉప్పెనతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. భారీ హైప్ మధ్య విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా

'మెగా' కుటుంబం నుండి వచ్చిన ఇంకో హీరో పంజా వైష్ణవ్ తేజ్. బ్లాక్ బస్టర్ చిత్రం ఉప్పెనతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. భారీ హైప్ మధ్య విడుదలైన ఈ రొమాంటిక్ డ్రామా మొదటి సినిమాకే అత్యధిక వసూళ్లు చేసిన టాలీవుడ్ హీరోగా వైష్ణవ్ నిలిచేలా చేసింది. చిరుత (2007) రికార్డులను కూడా ఈ సినిమా బద్దలు కొట్టింది. ఆ తర్వాత వరుసగా వైష్ణవ్ సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఉప్పెన తర్వాత ఎన్నో చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లు గా ముగిశాయి.

ఇక యాక్షన్ డ్రామా ఆదికేశవ (2023) కూడా అదే బాటలో పయనించింది. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కథలో కొత్తదనం లేకపోవడం.. రొటీన్ సినిమా కావడంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. వారం రోజులు కూడా థియేటర్లలో ఈ సినిమా సందడి చేయలేకపోయింది. అయితే ఈ చిత్రం టెలివిజన్‌లో ప్రీమియర్ అయినప్పుడు బ్లాక్ బస్టర్ రేటింగ్‌ను అందుకుంది. సినిమా శాటిలైట్ హక్కులను తక్కువ ధరకు కొనుగోలు చేసిన స్టార్ మా, 9.8–10.5 TRP రేటింగ్‌ సాధించినట్లు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వం వహించిన వైష్ణవ్ రెండవ వెంచర్, కొండ పొలం (2021), పట్టణ ప్రాంతాల్లో కూడా 12.3 అద్భుతమైన TRPని పొందింది. ఏది ఏమైనా థియేటర్లలో డిజాస్టర్ అయినా.. ఆదికేశవ చిన్న స్క్రీన్‌లలో మంచి విజయం సాధించినట్లు తెలుస్తోంది. ఇక వరుస ఫ్లాప్ లు అందుకుంటున్న వైష్ణవ్ బ్లాక్ బస్టర్ ఎప్పుడు కొడతాడా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.

Updated On 15 Feb 2024 10:37 PM GMT
Yagnik

Yagnik

Next Story