మెగా ఫ్యామిలీలో(Mega Family) అంతా లవ్ మ్యారేజ్(Love Marriage) లు చేసుకోవాలి అని నిర్ణయించుకున్నట్టున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) మూడు పెళ్లిళ్లు ప్రేమించే చేసుకున్నాడు. అటు రామ్ చరణ్ తన చిన్ననాటి ఫ్రెండ్ ఉపాసనను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్ళాడాడు. అల్లు అర్జున్ కూడా స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు .. ఇక రీసెంట్ గా వరుణ్ తేజ్(Varun Tej) కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని(Lavnya Tripati) రహస్యంగా ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్ళి చూసుకున్నాడు. ఇక మరో మెగా హీరో కూడా లవ్ మ్యారేజ్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే అతను ఎవరో కాదు.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.

మెగా ఫ్యామిలీలో వరుసగా ప్రేమ పెళ్లిళ్లు.. హీరోయిన్ తో ప్రేమ లో మెగా మేనల్లుడు ఈ విషయం క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో నిజం ఎంత..?

మెగా ఫ్యామిలీలో(Mega Family) అంతా లవ్ మ్యారేజ్(Love Marriage) లు చేసుకోవాలి అని నిర్ణయించుకున్నట్టున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) మూడు పెళ్లిళ్లు ప్రేమించే చేసుకున్నాడు. అటు రామ్ చరణ్ తన చిన్ననాటి ఫ్రెండ్ ఉపాసనను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్ళాడాడు. అల్లు అర్జున్ కూడా స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు .. ఇక రీసెంట్ గా వరుణ్ తేజ్(Varun Tej) కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని(Lavnya Tripati) రహస్యంగా ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్ళి చూసుకున్నాడు. ఇక మరో మెగా హీరో కూడా లవ్ మ్యారేజ్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే అతను ఎవరో కాదు.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.

టాలీవుడ్ హీరో వైష్ణవ్ తేజ్(Vaishanv Tej). వైష్ణవ్ తేజ్ ప్రేమలో పడ్డాడంటూ వార్తలు వైరల్అవుతున్నాయి. అయితే ఈ వార్తలు గతంలోనే వచ్చినా. ఇప్పుడు మరోసారి స్ట్రాంగ్ గా వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలప ప్రకారం వైష్ణవ్ తేజ్ తెలుగు హీరోయిన్ రీతూ వర్మను(Rithu Varma) ప్రేమిస్తున్నాడని.. త్వరలో పెళ్ళాడబోతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అది తాజాగా వరణ్ తేజ్ పెళ్లి టైమ్ లో అనుమానం బయటకు వచ్చింది. వరుణ్ తేజ్ పెళ్లికంటే ముందు.. ఈ జంటకు మెగా, అల్లు కుటుంబాలు ప్రీవెడ్డింగ్‌ పార్టీలు ఏర్పాటు చేశాయి. అయితే, అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీకి నటి రీతూ వర్మ హాజరు కావడం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ పార్టీలో రీతుతో వైష్ణవ్ తేజ్ క్లోజ్ గా కనిపించడంతో వీరిపై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. మెగా కాంపౌండ్‌లోని ఓ హీరోతో ఆమె రిలేషన్ షిప్‌లో ఉందంటూ నెట్టింట చర్చ మొదలైంది.వైష్ణవ్ తో రీతూ వర్మ ప్రేమలో ఉందని.. త్వరలోనే ఆమె కూడా మెగా ఫ్యామిలీలోకి కోడలిగా ఎంట్రీ ఇస్తుందని చాలా మంది కామెంట్లు చేశారు. ఈ వార్త వైరల్ అవ్వడం.. రకరకాల కామెంట్లు రావడంతో తాజాగా ఈ రూమర్స్ పై మెగా హీరో వైష్ణవ్ తేజ్ స్పందించాడు.

ఆదికేశవ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వైష్ణవ్ తేజ్ ఈ విధంగా స్పందించాడు. ఈ వార్తల్లో అసలు నిజం లేదన్నారు. అంతే కాదు లావణ్య త్రిపాఠీకి రీతూ మంచి స్నేహితురాలు కాబట్టే ఆ పార్టీకి తను వచ్చిందన్నారు. అంతకు మించి మరేమీ లేదని ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. అయితే గతంలో కూడా వైష్ణవ్ తేజ్ కు సంబంధించిన ప్రేమ వార్తలు వైరల్ అయ్యాయి. కృతీ శెట్టితో వైష్ణవ్ రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వినిపించాయి.

Updated On 20 Nov 2023 7:47 AM GMT
Ehatv

Ehatv

Next Story