సూపర్‌స్టార్ కృష్ణ(Super Star Krishna) నట జీవితంలో, ఆ మాటకొస్తే తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న అల్లూరి సీతారామరాజు(Alluri Sitarama Raju) సినిమా వచ్చి ఇవాళ్టికి 50 ఏళ్లు. సినిమా గురించి కొన్ని ముచ్చట్లు.. తెలుగులో పూర్తిస్థాయిలో వచ్చిన మొట్టమొదటి సినిమా స్కోప్ ఈస్ట్‌మన్‌కలర్ సినిమా అల్లూరి సీతారామరాజునే! అప్పటికే రెండేళ్ల కిందట అంటే 1972లో దక్షిణ భారతదేశపు మొట్టమొదటి సినిమాస్కోప్ ఈస్ట్‌మన్‌కలర్ సినిమా రాజరాజ చోళన్ విడుదలయ్యింది. సీతారామరాజు సినిమాకు ఛాయగ్రాహకుడు వి.ఎస్.ఆర్.స్వామి. […]
సూపర్‌స్టార్ కృష్ణ(Super Star Krishna) నట జీవితంలో, ఆ మాటకొస్తే తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న అల్లూరి సీతారామరాజు(Alluri Sitarama Raju) సినిమా వచ్చి ఇవాళ్టికి 50 ఏళ్లు. సినిమా గురించి కొన్ని ముచ్చట్లు.. తెలుగులో పూర్తిస్థాయిలో వచ్చిన మొట్టమొదటి సినిమా స్కోప్ ఈస్ట్‌మన్‌కలర్ సినిమా అల్లూరి సీతారామరాజునే! అప్పటికే రెండేళ్ల కిందట అంటే 1972లో దక్షిణ భారతదేశపు మొట్టమొదటి సినిమాస్కోప్ ఈస్ట్‌మన్‌కలర్ సినిమా రాజరాజ చోళన్ విడుదలయ్యింది. సీతారామరాజు సినిమాకు ఛాయగ్రాహకుడు వి.ఎస్.ఆర్.స్వామి. ఆ రోజుల్లో సినిమాస్కోప్ ఫార్మట్‌లో సినిమా తీయడానికి అవసరమైన లెన్స్‌లు దేశంలో రెండే రెండు ఉండేవి. ఆ రెండూ మహల్ పిక్చర్స్ అధినేత కమాల్ అమ్రోహి దగ్గర ఉండేవి. సీతారామరాజు చిత్ర యూనిట్ ఆయన దగ్గర నుంచి ఆ రెండు లెన్స్‌ను అద్దెకు తెచ్చుకుంది. మిచెల్ కెమరా(Mitchell Camera)లకు వాటికి అనుసంధానించి చిత్రీకరణ జరిపారు. ఇప్పుడంటే సాంకేతికంగా బోల్డన్ని సదుపాయాలు వచ్చాయి. కానీ ఏ సదుపాయాలు లేని ఆ రోజుల్లో కేవలం ఈ రెండు లెన్స్‌లతో మిచెల్ కెమెరాలతో తీసిన సినిమా అల్లూరి సీతారామరాజు. 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ సినిమా చూసినా విజువల్స్ అద్భుతంగా అనిపిస్తాయి.