పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) ఇటు రాజకీయాలు, సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. ఇదిలా ఇప్పుడు పవన్ నటిస్తున్న సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్ అండ్ అలాగే ఓజీ సినిమాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Hari Hara Veera Mallu
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) ఇటు రాజకీయాలు, సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. ఇదిలా ఇప్పుడు పవన్ నటిస్తున్న సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్ అండ్ అలాగే ఓజీ సినిమాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చాలా గ్యాప్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) చిత్ర నిర్మాతలు ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. అదేంటంటే రేపు మే 11, 2023న సాయంత్రం 4:59 నిమిషాలకు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు. ఇది ఒక పోస్టర్ మాత్రమే కాదు.. ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు.. మేము ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి విడుదల చేయబోయే ఫస్ట్ గ్లింప్స్ యూట్యూబ్‌ను బ్లాక్ చేయబోతుందని చెప్తున్నారు చిత్రదర్శ నిర్మాతలు
ఈ పోస్టర్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ టైమ్, డేట్‌ను క్లాప్ బోర్డు మీద చూపించారు. ఈ చిత్రాన్ని హరీష్‌శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటులు పంకజ్ త్రిపాఠి, అషుతోష్ రాణా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓజీ చిత్రంలో డ్రామా, యాక్షన్, లవ్ అండ్ మెలోడీ.. ఏ పవర్ ప్యాక్డ్ లాంగ్ షెడ్యూల్ పూర్తయిందంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్వీట్ వేశారు. ఓజీ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక పవన్ కల్యాణ్ నటిస్తున్న మరో చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). ఈ చిత్రం క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పీరియాడిక్ డ్రామాలో నిధి అగర్వాల్, బాబి డియోల్, విక్రంజిత్ విర్క్, కౌశిక్ మహతా నటిస్తున్నారు.
