పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్(Pawan kalyan) క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ సినిమా వస్తున్నదంటే చాలు అభిమానుల్లో ఎక్కడ్లేని ఉత్సాహం వచ్చేస్తుంది. రాజకీయాలతో తీరిక లేకుండా ఉన్న పవన్ టైమ్ చూసుకుని సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్‌సింగ్(Ustad Bhagath Singh) షూటింగ్‌లో ఉన్నారు పవన్.

Ustad Bhagath Singh New Poster
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్(Pawan kalyan) క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ సినిమా వస్తున్నదంటే చాలు అభిమానుల్లో ఎక్కడ్లేని ఉత్సాహం వచ్చేస్తుంది. రాజకీయాలతో తీరిక లేకుండా ఉన్న పవన్ టైమ్ చూసుకుని సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్‌సింగ్(Ustad Bhagath Singh) షూటింగ్‌లో ఉన్నారు పవన్. ఈ షెడ్యూల్‌లో రకరకాల ఆయుధాలతో హీరోచితమైన పోరాటాలు చేయనున్నారు. ఇప్పటికే ఒక దశ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఉస్తాద్ భగత్‌సింగ్ కొత్త షెడ్యూల్‌ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ని(Poster) విడుదల చేశారు మేకర్స్. ఇందులో పవన్‌కల్యాణ్ ఖాకీ డ్రెస్‌లో స్టైలిష్‌గా తుపాకీ చేతపట్టి కనిపించారు. పవన్‌కల్యాణ్‌ను మరోసారి పక్కా మాస్ అవతారంలో చూపిస్తున్నారు దర్శకుడు హరీశ్ శంకర్. పోలీసు అధికారిగా పవన్ తెరపై చేయనున్న సందడి అలరిస్తుందట! ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి నేతృత్వంలో తీర్చిదిద్దిన సెట్‌లో కీలకమైన యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఆయుధాలను కూడా రెడీ చేశారు. వీటితో చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ కనిపిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, గౌతమి, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
