వన్డ్ వరల్డ్‌కప్(One Day World Cup) టోర్నమెంట్‌లో టీమిండియా(Team india) దూసుకుపోతున్నది. వరుస విజయాలతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. ఇండియా ప్రదర్శనతలో వరల్డ్ కప్ ఫీవర్ పీక్ స్టేజ్‌కు చేరింది. ఇదే సమయంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను(Rishabh Panth) మిస్ అయ్యామేనని కొందరు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా(Urvasi rautela) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది.

Urvasi Rautela
వన్డ్ వరల్డ్‌కప్(One Day World Cup) టోర్నమెంట్‌లో టీమిండియా(Team india) దూసుకుపోతున్నది. వరుస విజయాలతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. ఇండియా ప్రదర్శనతలో వరల్డ్ కప్ ఫీవర్ పీక్ స్టేజ్‌కు చేరింది. ఇదే సమయంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను(Rishabh Panth) మిస్ అయ్యామేనని కొందరు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా(Urvasi rautela) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ఆ వీడియో చూసినవాళ్లు రిషబ్ పంత్‌ని గుర్తుచేసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదం కారణంగా సుమారు సంవత్సరం నుంచి క్రికెట్‌కు రిషబ్ పంత్ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఊర్వశి రౌతేలా, రిషబ్ పంత్ మధ్య వివాదం జరిగింది. వారిద్దరి మధ్య సోషల్ మీడియా వార్ కూడా భారీగానే సాగింది. వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని తర్వాత కొన్ని గొడవల వల్ల విడిపోయారనే కథనాలు కూడా వచ్చాయి. వీటిని ఊర్వశి రౌతేలా కానీ, రిషబ్ పంత్ కానీ ఖండించలేదు. ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అలాగే తనకు అనిపించిన విషయాన్ని సూటిగా చెబుతారు. ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. వైట్ అండ్ వైట్ స్టోర్ట్స్ డ్రెస్‌లో ఆమె వికెట్ కీపింగ్ చేస్తున్న వీడియో అది. కాప్షన్‌గా కొత్త అధ్యాయం, కొత్త సినిమా అని రాశారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రోల్ అవుతోంది. ఊర్వశి రౌతేలా కొన్ని వివాదాల్లో చిక్కుకున్న సంగతి అందరికీ తెలుసు. అందులో రిషబ్ పంత్‌తో వివాదం కూడా ఒకటి. రిషబ్ తనకు చాలాసార్లు ఫోన్ చేశాడని ఆమె గతంలో చేసిన ప్రకటన ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. అనంతరం ఊర్వశి కూడా సారీ చెప్పారు. మళ్లీ తాజాగా కొత్త సినిమా కోసమే అంటూ వికెట్ కీపింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. దీంతో రిషబ్ పంత్ గొడవను మళ్లీ తెరపైకి తెస్తారా ఏమిటి? అని నెటిజన్లు అనుకుంటున్నారు.
