బాలీవుడ్‌ సుందరి ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచితురాలే! మెగాస్టార్‌(chiranjeevi) నటించిన వాల్తేరు వీరయ్యలో(Waltheru Veeraya) ఓ ఐటమ్‌ సాంగ్‌తో(Item Song) తెలుగు అభిమానులను మెప్పంచారు ఊర్వశి రౌతేలా. బాస్ పార్టీ అంటూ సాగే ఆ పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆ తర్వాత కూడా అఖిల్ అక్కినేని చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఊర్వశి రౌతేలా అభిమానులతో టచ్‌లో ఉంటారు. ఇప్పుడీ భామకు అరుదైన అవకాశం లభించింది.

బాలీవుడ్‌ సుందరి ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచితురాలే! మెగాస్టార్‌(chiranjeevi) నటించిన వాల్తేరు వీరయ్యలో(Waltheru Veeraya) ఓ ఐటమ్‌ సాంగ్‌తో(Item Song) తెలుగు అభిమానులను మెప్పంచారు ఊర్వశి రౌతేలా. బాస్ పార్టీ అంటూ సాగే ఆ పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆ తర్వాత కూడా అఖిల్ అక్కినేని చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఊర్వశి రౌతేలా అభిమానులతో టచ్‌లో ఉంటారు. ఇప్పుడీ భామకు అరుదైన అవకాశం లభించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే వరల్డ్‌ కప్‌(One day world cup) జరుగనున్న విషయం తెలిసిందే కదా! ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్‌కు ఇండియా ఆతిథ్యమిస్తోంది. టోర్నమెంట్‌ ప్రారంభానికి ముందు వరల్డ్‌కప్‌ ట్రీఫీ చాలా దేశాలను చుట్టేసి వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫ్రాన్స్‌లోని ప్రతిష్ఠాత్మక ఈఫిల్ టవర్‌ ముందు ఐసీసీ ప్రపంచ కప్ -2023ను ఆవిష్కరించారు. అయితే ఈ ట్రోఫీని బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఆవిష్కరించడం విశేషం. ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న తొలి నటిగా ఉర్వశి నిలిచారు. ఈ విషయాన్ని ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వరల్డ్‌ కప్‌ ముందు ఫోటోలకు పోజులిచ్చారు. ఈ అవకాశమిచ్చిన ఐసీసీకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు ఊర్వశిపై భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందని ఓ నెటిజన్ అంటే, రిషబ్ భయ్యా దృష్టిలో పడేందుకేనా అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఊర్వశి రౌతేలా వరల్డ్ కప్ పట్టుకుందంటే.. ఇక నెక్స్ట్ రిషబ్ భయ్యా వంతు అంటూ ఇంకో నెటిజన్‌ పోస్ట్ చేశాడు. ఇప్పుడు గెలవాల్సింది ఒకటి కాదు.. రెండు ట్రోఫీలు అంటూ ఫన్నీగా కామెంట్‌ చేశాడు. వన్డే వరల్డ్ కప్-2023 అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు జరగనుంది. గతంలో టీమిండియా ప్లేయర్‌ రిషబ్ పంత్‌తో ఊర్వశి రౌతేలా డేటింగ్‌లో ఉందంటూ సోషల్‌ మీడియాలో స్టోరీలు వచ్చాయి.

Updated On 24 Aug 2023 7:00 AM GMT
Ehatv

Ehatv

Next Story