గ్లామర్‌ క్వీన్‌ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) మళ్లీ వార్తల్లోకి వచ్చారు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌(Sai Dharam Tej) కలిసి నటిస్తున్న బ్రో సినిమా(Bro Movie)లో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయబోతున్నారు. బాస్‌ పార్టీతో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్స్‌ స్పెషలిస్టు అని చెప్పాలి. వరుస ఐటం సాంగ్స్‌తో ఆమె దూసుకుపోతున్నారు. రెమ్యునరేషన్‌ కూడా ఆ స్థాయిలోనే ఉంది.

గ్లామర్‌ క్వీన్‌ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) మళ్లీ వార్తల్లోకి వచ్చారు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌(Sai Dharam Tej) కలిసి నటిస్తున్న బ్రో సినిమా(Bro Movie)లో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయబోతున్నారు. బాస్‌ పార్టీతో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్స్‌ స్పెషలిస్టు అని చెప్పాలి. వరుస ఐటం సాంగ్స్‌తో ఆమె దూసుకుపోతున్నారు. రెమ్యునరేషన్‌ కూడా ఆ స్థాయిలోనే ఉంది. ఈమధ్యనే ఆమె 190 కోట్ల రూపాయలు పెట్టి ఓ బంగ్లా కొనుక్కున్నారు. ఆమె బర్త్‌డే సెలబ్రేషన్స్‌కే 93 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారట. అంతేనా.. డ్రస్సులకు, నగలకు, మేకప్‌కు బోల్డంత డబ్బును ఖర్చు పెడుతుంటారట. ఎవరైనా అడిగితే గ్లామర్‌ ఫీల్డ్‌ అన్న తర్వాత ఆ మాత్రం మెయింటెన్‌ చేయకపోతే ఎలా అని ఎదురు ప్రశ్నిస్తుంటారు ఊర్వశి రౌతేలా. స్టయిలీష్‌గా కనిపించడానికే సంపాదనలో ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తుంటారు.

ఇంత వరకు బాగానే ఉంది కానీ నైట్‌ డ్రెస్‌ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టడమే కాస్త విడ్డూరంగా ఉంది. పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ సినిమా బ్రో సినిమా కోసం ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆమె పింక్‌ కలర్‌ నైట్ సూట్‌లో దర్శనమించారు. నైట్‌ డ్రెస్సే కదా ఓ వెయ్యో రెండు వేలో ఉంటుందనుకుంటున్నారా? ఆమె ధరించిన డ్రెస్‌ ఖరీదు 91 వేల రూపాయలు. ఈ విషయం తెలిసి ఆమె ఫ్యాన్సే ఆశ్చర్యపోతున్నారు. ' ఇంత సింపుల్‌గా ఉన్న డ్రెస్‌ కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టావా? మహాతల్లి.. నిజంగానే నువ్వు గ్రేట్‌ అని ఒకరు కామెంట్‌ చేస్తే, మీరు డబ్బున్నోళ్లు మేడమ్‌, మీరు ఏం చేసినా చెల్లుతుంది అని మరొకరు వ్యాఖ్యానించారు.

Updated On 6 Jun 2023 12:18 AM GMT
Ehatv

Ehatv

Next Story