సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి బిగ్ బ్యూటీ, నటి ఉర్ఫీ జవెద్(Urfi Javed) బాగా సుపరిచితమే! హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో(social Media) హీట్ పుట్టిస్తుంటారు ఉర్ఫీ జావెద్. కొత్త కొత్త ఫోటో షూట్‌లతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తుంటారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి బిగ్ బ్యూటీ, నటి ఉర్ఫీ జవెద్(Urfi Javed) బాగా సుపరిచితమే! హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో(social Media) హీట్ పుట్టిస్తుంటారు ఉర్ఫీ జావెద్. కొత్త కొత్త ఫోటో షూట్‌లతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తుంటారు. చిత్ర విచిత్ర వేషధారణతో ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటారు. ఇప్పుడీ బ్యూటీ ఓ సర్జరీ చేయించుకున్నారు.. సర్జరీ వల్ల అందం మెరుగవ్వడం మాట అటుంచి అందవిహీనంగా తయారయ్యారు ఉర్ఫీ జావెద్. ఈ విషయం ఆమెనే చెబుతూ ఫోటోలు కూడా షేర్ చేశారు. పెదాలు అందంగా కనిపించడానికి లిప్ ఫిల్లర్ సర్జరీ(Lip Filler Surgery) చేయించుకుంటే అది కాస్తా వికటించింది.
ఆమె ముఖారవిందం పాడయ్యింది. 'పెదాల కోసం చేసుకున్న సర్జరీ గురించి మీకు చెబుతున్నాను.. 18 ఏళ్ల వయసు నుంచి లిప్ ఫిల్లర్ సర్జరీ చేయించుకుంటున్నాను. అప్పుడు నా దగ్గర ఎక్కువగా డబ్బులుండేవి కావు. కానీ నా పెదాలు చాలా సన్నగా ఉండటంతో వాటిని ఎలాగైనా సరే లావుగా కనబడేలా చేయించాలనుకున్నాను. ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లి తన సమస్య చెప్పుకున్నాను. తక్కువ ఖర్చుతో సర్జరీ చేస్తానని చెప్పాడు. సరే అన్నాను. రిజల్ట్ ఇలా ఉంది.. కొన్నాళ్లకు ఈ సర్జరీని ఆపేయాల్సి వచ్చింది. లిప్ ఫిల్లర్ సర్జీ చాలా ప్రమాదకరం.
దాని పరిణామాలు బాధాకరంగా ఉంటాయి. మీరు చేయించుకోవద్దని చెప్పడం లేదు. కానీ ఫిల్లర్స్, బొటాక్స్ వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను' అని ఉర్ఫీ తెలిపారు. ఇప్పటికీ తాను లిప్ ఫిల్లర్స్ వాడుతున్నాననీ, తన ముఖానికి ఏది సరిపోతుంది? ఏది ఎంత మోతాదులో సూటవుతుందనేది తనకు ఇప్పుడు బాగా తెలుసని ఉర్ఫీ జావెద్ అన్నారు. 'మీరెవరైనా డాక్టర్ దగ్గరకు వెళ్లేముందు అన్నింటి గురించి వివరంగా తెలుసుకోండి.
మీ ముఖం బాగోలేదని, మీ శరీరాకృతి సరిగా లేదని మిమ్మల్ని మీరు ద్వేషించుకునే బదులు ఇలాంటి ఫిల్లర్స్, సర్జరీ ఎంచుకోవడమే మంచిదని చెబుతాను. కాకపోతే మంచి డాక్టర్ దగ్గర మాత్రమే ట్రీట్‌మెంట్ తీసుకోండి' అని చెప్పుకొచ్చారు ఉర్ఫీ జావెద్. ఇటీవలే ఉర్ఫీ జావెద్‌కు ఓ చేదు అనుభవం ఎదురయ్యిన్న విషయం గుర్తుండే ఉంటుంది. ఆమె విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కో ప్యాసింజర్ మద్యం మత్తులో ఆమెను వేధించాడట. ఈ విషయాన్ని ఉర్ఫీ జావెద్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వెల్లడించారు.