ఉర్ఫీ జావెద్(Urfi Javed) పరిచయం అక్కర్లేని పేరు. సోషల్‌ మీడియాను ఫాలో అయ్యే వారికి ఈ పేరు సుపరిచతమే. హాట్‌ హాట్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో(social Media) హీట్‌ పుట్టిస్తుంటారు ఉర్ఫీ జావెద్‌. కొత్త కొత్త ఫోటో షూట్‌లతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తుంటారు. లేటెస్ట్‌గా ఉర్ఫీ జావెద్‌కు ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కో ప్యాసింజర్‌ మద్యం మత్తులో ఆమెను వేధించాడు. ఈ విషయాన్ని ఉర్ఫీ జావెద్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌(instagram) స్టోరీస్‌ ద్వారా వెల్లడించారు.

ఉర్ఫీ జావెద్(Urfi Javed) పరిచయం అక్కర్లేని పేరు. సోషల్‌ మీడియాను ఫాలో అయ్యే వారికి ఈ పేరు సుపరిచతమే. హాట్‌ హాట్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో(social Media) హీట్‌ పుట్టిస్తుంటారు ఉర్ఫీ జావెద్‌. కొత్త కొత్త ఫోటో షూట్‌లతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తుంటారు. లేటెస్ట్‌గా ఉర్ఫీ జావెద్‌కు ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కో ప్యాసింజర్‌ మద్యం మత్తులో ఆమెను వేధించాడు. ఈ విషయాన్ని ఉర్ఫీ జావెద్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌(instagram) స్టోరీస్‌ ద్వారా వెల్లడించారు. గురువారం రాత్రి వెకేషన్ కోసం ముంబాయి నుంచి గోవాకు వెళ్లారు. ఆ సమయంలో విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఉర్ఫీని టీజ్‌(Teasing) చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉర్ఫీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పెట్టారు. ' నిన్న ముంబాయి నుంచి గోవాకు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో నేను వేధింపులకు గురయ్యాను. వీడియోలోని వ్యక్తులు నన్ను వేధింపులకు గురి చేశారు. ఈవ్‌ టీజింగ్‌ చేశారు. దీంతో నేను వారితో వాదనకు దిగాను. అప్పుడు అతడు మద్యం తాగి ఉన్నాడని అతడి స్నేహితులు చెప్పారు. తాగి ఉన్నా సరే, ఇలా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని క్షమించలేను. నేను పబ్లిక్‌ ఫిగర్‌నే కావొచ్చు కానీ పబ్లిక్‌ ప్రాపర్టీని మాత్రం కాదు' అని ఉర్ఫీ జావెద్‌ చెప్పుకొచ్చారు.

Updated On 22 July 2023 4:32 AM GMT
Ehatv

Ehatv

Next Story