పంజా వైష్ణవ్ తేజ్ (panja vaisshnav tej) తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టేటస్ క్రియేట్ చేసుకున్నాడు. ఉప్పెన (Uppena) తర్వాత కొండపొలం, రంగరంగ వైభవంగ చిత్రాల్లో నటించాడు. అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న నాలుగో చిత్రమే ఆదికేశవ. ఈ చిత్రాన్ని సంబంధించిన యాక్షన్ ప్యాక్డ్ టీజర్‏ను విడుదల చేసింది చిత్ర బృందం.

పంజా వైష్ణవ్ తేజ్ (panja vaisshnav tej) తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టేటస్ క్రియేట్ చేసుకున్నాడు. ఉప్పెన (Uppena) తర్వాత కొండపొలం, రంగరంగ వైభవంగ చిత్రాల్లో నటించాడు. అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న నాలుగో చిత్రమే ఆదికేశవ. ఈ చిత్రాన్ని సంబంధించిన యాక్షన్ ప్యాక్డ్ టీజర్‏ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ లో వైష్ణవ్ తేజ్ క్యారెక్టర్‏ను రుద్ర ఆదికేశవగా ఇంట్రడ్యూస్ చేశారు. ‘‘ఆ గుడి జోలికి మాత్రం రాకండయ్యా.. శివుడికి కోపం వస్తే ఊరికి మంచికి కాదు’’ అంటూ ఆ గుడి అర్చకుడి డైలాగ్‏తో ఈ టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత విలన్స్ అంతా ఒక చిన్న విలేజ్‏లో శివాలయాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే.. ఆదికేశవ విలన్స్‏ను చితకొట్టినట్టు టీజర్‏లో చూపించారు. ఆ తర్వాత త్రిశూలం ఫాస్ట్‏గా వచ్చి ఆదికేశవ (AadiKeshava) అనే టైటిల్‏ను రివీల్ చేశారు. టీజర్ చూస్తుంటే. సినిమా కథ అంతా కూడా ఆ గుడి చుట్టునే ఉంటున్న కనిపిస్తోంది. ఇక ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్‏గా శ్రీలీల (Sreeleela) నటిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లన్నీ ఆడియన్స్‏ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‏టైన్‏మెంట్స్, ఫార్య్చూన్ ఫోర్ సినిమాస్రూపొందిస్తున్నాయి. ఇక ఈ సినిమాతో జాతీయ అవార్డు గ్రహీత అయిన జోజు జార్జ్ టాలీవుడ్‏కు పరిచయం అవుతున్నారు. ఇక ఆయన లుక్‏తోపాటు హీరో క్యారెక్టరైజేషన్ పోస్టర్ అదిరిపోయింది. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela)తోపాటు వజ్ర కాళేశ్వరిగా అపర్ణ దాస్ (Aparna Das) నటిస్తోంది. ఈ మూవీతో టాలీవుడ్‏కు శ్రీకాంత్ ఎన్‏రెడ్డి (Srikanth N Reddy) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమాకు జి.వి ప్రకాశ్ కుమార్ (G.V.Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా జులైలో విడుదల చేయబోతున్నారు మేకర్స్.

Updated On 15 May 2023 6:33 AM GMT
Ehatv

Ehatv

Next Story