ఇప్పుడంటే కాసింత వెనుకబడ్డారు కానీ మామూలుగా అయితే టాలీవుడ్‌లో కృతిషెట్టి(Krithi Shetty) పేరు తెలియని వారు ఉండరు. మొదటి సినిమా ఉప్పెనతోనే ఆమె ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. అందం, అభినయంతో సినీ ప్రియులను కట్టిపడేశారు. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు వచ్చాయి ఆమెకు!
ఇప్పుడంటే కాసింత వెనుకబడ్డారు కానీ మామూలుగా అయితే టాలీవుడ్‌లో కృతిషెట్టి(Krithi Shetty) పేరు తెలియని వారు ఉండరు. మొదటి సినిమా ఉప్పెనతోనే ఆమె ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. అందం, అభినయంతో సినీ ప్రియులను కట్టిపడేశారు. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు వచ్చాయి ఆమెకు! శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలలో కృతి షెట్టి నటించారు. ఇటీవల నగచైతన్యతో కలిసి కస్టడీ సినిమాలో నటించారు. సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ కూడా అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. అందుకే అప్పుడప్పుడు హీరోయిన్లకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఇలాంటి వాటిని తట్టుకుని నిలబడాలి. మొన్నీమధ్యనే ఇండస్ట్రీ పోకడలపై ఆర్‌ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు డైరెక్టర్లు తనను వాడుకుని వదిలేశారని ఆమె ఆరోపించారు. లేటెస్ట్‌గా కృతిషెట్టి కూడా వేధింపులకు గురయ్యారట. దీనికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమెను ఓ స్టార్ హీరో కుమారుడు టార్చర్ చేస్తున్నాడట. ఇటీవల ఓ హీరో కొడుకు కృతి షెట్టికి ఫోన్ చేసి తనతో ఫ్రెండ్‌షిప్ చేయాలని వేధింపులకు గురి చేశాడట. తరచూ ఇదే పని చేస్తున్నాడట. మొన్నటికి మొన్న తన బర్త్ డే పార్టీకి రావాలని ఆహ్వానం కూడా పంపాడట! పార్టీకి వస్తే డబ్బులు ఎంత కావాలన్నా ఇస్తానంటూ ఆఫర్ కూడా ఇచ్చాడట! అయితే ఆ స్టార్ హీరో కొడుకు ఎవరై ఉంటారా అని నెటిజన్లు బుర్ర బద్దలుకొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం కృతిషెట్టి శర్వానంద్ సరసన ఓ సినిమాలో నటిస్తున్నారు.