పంజా వైష్ణవ్ తేజ్ (panja vaisshnav tej) తొలి చిత్రం అయిన ఉప్పెన (Uppena) చిత్రంతో ఉప్పెనలా వచ్చి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఈ హీరో మొదటి నుంచి స్క్రిప్ట్‏లను చాలా స్మార్ట్‏గా ఎంచుకుంటున్నాడు. ఇక ఆయన నెక్ట్స్ సినిమా హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‏టైనర్ అయి ఉండాలని డిసైడ్ అయ్యాడు మన ఆసి.

పంజా వైష్ణవ్ తేజ్ (panja vaisshnav tej) తొలి చిత్రం అయిన ఉప్పెన (Uppena) చిత్రంతో ఉప్పెనలా వచ్చి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఈ హీరో మొదటి నుంచి స్క్రిప్ట్‏లను చాలా స్మార్ట్‏గా ఎంచుకుంటున్నాడు. ఇక ఆయన నెక్ట్స్ సినిమా హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‏టైనర్ అయి ఉండాలని డిసైడ్ అయ్యాడు మన ఆసి. ఇప్పుడు ఆయన చేస్తున్న తాజా చిత్రం #PVT04. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లన్నీ ఆడియన్స్‏ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‏టైన్‏మెంట్స్, ఫార్య్చూన్ ఫోర్ సినిమాస్ PVT04 పేరుతో యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‏టైనర్‏ను రూపొందిస్తున్నాయి.

PVT04 సినిమా ఫస్ట్ గ్లింప్స్‏ను మే15న అంటే సోమవారం సాయంత్రం 4:05 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ఒక వీడియోతో అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాతో జాతీయ అవార్డు గ్రహీత అయిన జోజు జార్జ్ టాలీవుడ్‏కు పరిచయం అవుతున్నారు. ఇక ఆయన లుక్‏తోపాటు హీరో క్యారెక్టరైజేషన్ పోస్టర్ అదిరిపోయింది. ఇదిలా ఉండే హీరో ఫస్ట్ లుక్ మాత్రం ఇంకా విడుదలచేయలేదు.. ఫస్ట్ లుక్ మీ ఊహకందకుండా ఉంటుందని మూవీ టీమ్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ గర్ల్ అయిన శ్రీలీల (Sreeleela)తోపాటు వజ్ర కాళేశ్వరిగా అపర్ణ దాస్ (Aparna Das) నటిస్తోంది. ఇప్పటి వరకు చిత్ర బృందం విడుదల చేసిన క్యారెక్టర్ పోస్టర్లు మూవీకి చాలా పాజిటివ్ బజ్‏ను క్రియేట్ చేశాయి. ఈ మూవీతో టాలీవుడ్‏కు శ్రీకాంత్ ఎన్‏రెడ్డి (Srikanth N Reddy) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమాకు జి.వి ప్రకాశ్ కుమార్ (G.V.Prakash Kumar) సంగీతం అందిస్తున్నారు.

Updated On 13 May 2023 6:39 AM GMT
Ehatv

Ehatv

Next Story