త్వరలోనే తల్లి తండ్రులు కాబోతున్న రాంచరణ్(ramcharan) ,ఉపాసన(upasana) దంపతులు గత శుక్రవారం ఉపాసన సీమంతం వేడుకలను నిర్వహిస్తూ హైదరాబాద్ (hyderabad)లో ఒక ప్రైవేట్ పార్టీని ఏర్పాటు చేసారు . ఈ బేబీ షవర్(baby shower) పార్టీ ఫ్యామిలీ ,ఫ్రెండ్స్, అత్యంత సన్నిహితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది . ఈ వేడుకకు సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో సందడి చేస్తున్నాయి.

ఇటీవల రాంచరణ్ దంపతులు తమ హాలిడే ట్రిప్ ను ముగించుకొని తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు . దుబాయ్(dubai) లో ఘనంగా కొంతమంది సన్నిహితుల నడుమ ఇప్పటికే సీమంతం(baby shower) వేడుకను నిర్వహించటం జరిగింది . ఈ వేడుకకు సంబందించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి . అయితే హైదరాబాద్ లో తమ సొంత ఇంట్లో నిర్వహించిన బేబీ షవర్ ఫంక్షన్ కి కొంత మంది సినీ ప్రముఖుల మధ్య అట్టహాసంగా జరిగింది . ఈ ప్రైవేట్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు స్టైలిష్ స్టార్ బన్నీ . ఉపాసన తన ఇంట్లో నిర్వహించిన ఈ బేబీ షవర్ ఫంక్షన్ లో స్నేహితురాళ్లతో కలిసి బాగా ఎంజాయ్ చేసింది . డిజైనర్ శిల్పా రెడ్డి ,సానియా మీర్జా ఇంకొంతమంది స్నేహితులతో కలిసి ఉపాసన తన బేబీ బంప్ పార్టీ లో సందడి చేసారు . ఈ పార్టీకి రామ్ చరణ్ సోదరీమణులు సుస్మిత, శ్రీజ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.
అల్లు అర్జున్(Allu Arjun) తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఉపాసన బేబీ బంప్ పార్టీ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు . త్వరలోనే తల్లితండ్రులు కాబోతున్న రాంచరణ్ ,ఉపాసన కు శుభాకాంక్షలు తెలియజేసారు . బేబీ షవర్(baby shower) నుండి ఒక ఫోటో షేర్ చేస్తూ, అల్లు అర్జున్ హార్ట్ ఎమోజితో "నా స్వీటెస్ట్ట్ ఉప్సీ @ ఉపాసనకమినేనికొనిదెల కి చాలా సంతోషంగా ఉంది" అంటూ రాశారు.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప -2 (Pushpa-2)చిత్రీకరణలో బిజీ గా ఉన్నారు .ఉపాసన బేబీ షవర్ పార్టీకి సంబందించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. కాగా ఈ నెల జులైలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు . ప్రెగ్నెన్సీ సమయంలో అన్ని పనులు పక్కన బెట్టి అపురూపమైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు ఈ జంట.