ఆస్కార్స్ రెడ్‌కార్పెట్‌పై ఉపాసన రామ్ చరణ్ జోడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే .. ఈ వేడుకల్లో మాత్రం ఉపాసన స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. అయితే మన దేశ సంస్కృతి ఉట్టిపడేలా ఆమె తెలుపు రంగు చీర ని ధరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆస్కార్స్ రెడ్‌కార్పెట్‌పై ఉపాసన రామ్ చరణ్ జోడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే .. ఈ వేడుకల్లో మాత్రం ఉపాసన స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. అయితే మన దేశ సంస్కృతి ఉట్టిపడేలా ఆమె తెలుపు రంగు చీర ని ధరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మన దేశం లో శాంతికి చిహ్నంగా నిలిచే తెలుపు రంగు ని ఎంత గౌరవిస్తామో అందరికీ తెలిసిందే. మన సంస్కృతి ప్రపంచం మొత్తం తెలిసేలా ఆమె చేసిన ఈ ప్రయత్నం కి మంచి పేరు లభించింది. తెలంగాణ‌కు చెందిన చేనేత కార్మికులే ఆ చీర‌ను నేసిన‌ట్లు ఆమె చెప్పారు. వైట్ శారీలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచిన ఉపాస‌న .. ఆస్కార్స్ వేడుక‌లో దిగిన ఫోటోల‌ను ఉపాస‌న త‌న ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఇక సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపిస్తున్న ఆ చీర వెనుక ఉన్న వ‌ర్క్ గురించి ఆమె డిటేల్‌గా త‌న పోస్టులో వివ‌రించారు. ఆ ప్ర‌త్యేక చీర గురించి కొన్ని విష‌యాలు చెప్పారు.

ఉపాసన ధరించిన ఈ చీరని జయంతి రెడ్డి అనే ప్రముఖ డిజైనర్ తయారు చేసిందట . స్క్రాప్ రీసైలిక్డ్ సిల్క్ శారీ అని పిలవబడే ఈ చీరకి మ్యాచింగ్ అయ్యేట్టు బీనా గోయెంకా మెరుగులు దిద్దిన లిలియ‌మ్ నెక్‌పీస్ ప్రత్యేక ఆకర్షణగా నిల్చింది. ప్రకృతి ని సంరక్షించాలనే గొప్ప మనసు ఉపాసన కి స్వతహాగానే ఉంటుంది. అందుకే హ్యాండ్ మేడ్ తో తయారు చేయించిన ఈ సిల్క్ శారీని ధరించింది.

ఇక శారీ తో పాటు ఆమె వేసుకున్న నెక్లెస్ గ్రాండ్ లుక్ ని తీసుకొచ్చింది.ఈ నెక్లెస్ ని తయారు చెయ్యడానికి దాదాపుగా నాలుగేళ్ల సమయం పట్టిందట.సుమారు 400 కేర‌ట్ల హై క్వాలిటీ రూబీస్‌ జెమ్ స్టోన్స్, ముత్యాలతో న‌గిషీలు దిద్దిన ఆభరణం ఇది. దీని విలువ కోట్లలోనే ఉంటుంది. ముంబైకి చెందిన బీనా గోయంక జెమ్ వ‌ర్క్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఆస్కార్స్‌లో త‌నను అందంగా తీర్చిదిద్దేందుకు డిజైన‌ర్లు, చేనేత కార్మికులు చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని, వాళ్ల డెడికేష‌న్‌, ప్యాష‌న్‌ను నిజంగా మెచ్చుకుంటున్న‌ట్లు ఉపాస‌న త‌న పోస్టులో తెలిపారు.

Updated On 15 March 2023 1:52 AM GMT
Ehatv

Ehatv

Next Story