గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌(Ram Charan)- ఉపాసన(Upasana) దంపతులకు పండంటి పాప పుట్టి పది రోజులయ్యింది.. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ వార్తల్లో ఉంటున్నారు. ఈ నెల 20న కొణిదెల వారి ఇంట మెగా ప్రిన్సెస్‌ అడుగుపెట్టింది. ఆ రోజు నుంచి మెగా ఇంట సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఆనందపడుతున్నారు. పాప పుట్టిన రోజు నుంచి ఇటు మీడియాలో, అటు సోషల్‌ మీడియాలో ఏ పేరు పెట్టబోతున్నారనే డిబేట్‌ నడుస్తూ ఉంది.

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌(Ram Charan)- ఉపాసన(Upasana) దంపతులకు పండంటి పాప పుట్టి పది రోజులయ్యింది.. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ వార్తల్లో ఉంటున్నారు. ఈ నెల 20న కొణిదెల వారి ఇంట మెగా ప్రిన్సెస్‌ అడుగుపెట్టింది. ఆ రోజు నుంచి మెగా ఇంట సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఆనందపడుతున్నారు. పాప పుట్టిన రోజు నుంచి ఇటు మీడియాలో, అటు సోషల్‌ మీడియాలో ఏ పేరు పెట్టబోతున్నారనే డిబేట్‌ నడుస్తూ ఉంది. లేటెస్ట్‌గా ఇదే విషయంపై ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్‌ చేశారు. ఇవాళ తన పాపకు పేరు పెట్టబోతున్నట్టు ఉపాసన తెలిపారు. మెగా వారసురాలి బారసాల కార్యక్రమం ఇవాళ ఘనంగా జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మెగా ప్రిన్సెస్‌ బారసాల కార్యక్రమంలో మెగా కుటుంబంతో పాటు అల్లు అరవింద్‌ కుటుంబసభ్యులు పాల్గొననున్నారు. అంతే కాకుండా మెగా కుటుంబానికి చెందిన దగ్గరి బంధువులు, స్నేహితులకు కూడా ఆహ్వానం అందింది. అయితే మెగా ప్రిన్సెస్‌ పేరును ఇప్పటికే ఖరారు చేశారు. కానీ పూజా కార్యక్రమంలో మాత్రమే పేరు రిలీవ్‌ చేయాలని చిరంజీవి చెప్పారట! మొత్తంగా మెగా ప్రిన్సెస్‌ పేరు ఏమిటో ఈరోజు తెలుస్తుంది. మెగా ఫ్యాన్స్‌ ఆ శుభ గడియ కోసం ఎదురుచూస్తున్నారు.

Updated On 30 Jun 2023 12:28 AM GMT
Ehatv

Ehatv

Next Story