సమాజం కోసమో.. లేదా వారసత్వాన్ని కంటీన్యూ చేయడం కోసమో తాను బిడ్డను కనడం లేదు అంటుంది ఉపాసన. సమాజానికి భయపడే వారిమే అయితే.. పెళ్లైన కొంత కాలానికే పిల్లల్ని కనేవారమన్నారు. ఇక త్వరలో మాతృత్వపు అనుభూతిని.. పొందబోతోంది ఉపాసన..ఫస్ట్ టైమ్ బేబీ బంప్ ఫోటోస్ శేర్ చేసిన మెగా కోడలు..
ఫస్ట్ టైమ్ బేబీ బంప్(Baby bump) ఫోటోలు రిలీజ్ చేశారు మెగా కోడలు.. రామ్ చరణ్(Ram charan) సతీమణి ఉపాసన(Upasana). అంతే కాదు మదర్స్ డే సందర్భంగా తన బిడ్డ గురించి ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ృ
సమాజం కోసమో.. లేదా వారసత్వాన్ని కంటీన్యూ చేయడం కోసమో తాను బిడ్డను కనడం లేదు అంటుంది ఉపాసన. సమాజానికి భయపడే వారిమే అయితే.. పెళ్లైన కొంత కాలానికే పిల్లల్ని కనేవారమన్నారు. ఇక త్వరలో మాతృత్వపు అనుభూతిని.. పొందబోతోంది ఉపాసన..ఫస్ట్ టైమ్ బేబీ బంప్ ఫోటోస్ శేర్ చేసిన మెగా కోడలు.. మదర్స్ డేను(Mother's day) గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. బేబీ బంప్ తో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు ఉపాసన. తాను తొలి మదర్స్ డేను జరుపుకుంటున్నాంటూ సంతోషం వ్యక్తం చేశారు.
ఈసందర్భంగా ఆమె తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.... మాతృత్వాన్ని స్వీకరించడానికి ఎంతో గర్వపడుతున్నా. నేను సమాజం అంచనాలకు అనుగుణంగా ఉండటానికో.. వారసత్వాన్ని కొనసాగించడానికో.. మా వివాహ బంధాన్ని బలోపేతం చేసుకోవాలనో నేను అమ్మను కావాలని అనుకోలేదు. అంతులేని ప్రేమను నా బిడ్డకు ఇవ్వగలనని, జాగ్రత్తగా చూసుకోగలనని నేను మానసికంగా ప్రిపేర్ అయిన తర్వాతనే తల్లిని కావాలని నిర్ణయం తీసుకున్నా.. అంటూ... సోషల్ మీడియాలో పోస్ట్ రాసుకోచ్చారు ఉపాసన.
ప్రస్తుతం ఉపాసన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాదు ఈ పోస్ట్ కు సోషల్ మీడియాలో వరుసగా కామెంట్లు వచ్చాయి. అంతే కాదు సామాన్యుల దగ్గర నుంచి..సెలబ్రిటీల వరకూ.. చాలా మంది ఉపాసన పోస్ట్ కుస్పందించారు. మరీ ముఖ్యంగా ... ఉపాసన పెట్టిన పోస్టుకు హీరోయిన్లు కామెంట్లు చేస్తున్నారు. కియారా అద్వానీ, సమంత, త్రిష, శ్రియ, సంయుక్త మీనన్ తదితరులు విష్ చేశారు. ‘హ్యాపీ మదర్స్ డే లవ్లీ మమ్మీ’ అంటూ కాజల్ అగర్వాల్ కామెంట్ చేసింది. ఇలా చాలామంది ఉపాసనకు శుభాకాంక్షలు తెలిపారు.