దాదాపు పెళ్లి అయిన 11 ఏళ్లకు తల్లీ తండ్రులు కాబోతున్నారు రామ్ చరణ్ -ఉపాసన. దాంతో మెగా ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నారు. ఉపాసనను బంగారు బొమ్మలా చూసుకుంటున్నారు. అయితే నెటిజన్లకు మాత్రం ఓ అనుమానం ఉంది. ఉపాసన ఏడునెలల్ గర్బవతి అయితే... బేబీ బంప్ ఎందుకు కనిపించడంలేదు అని. ఈ విషయంలో ఆమె ఏం క్లారిటీ ఇచ్చిందంటే..?

దాదాపు పెళ్లి అయిన 11 ఏళ్లకు తల్లీ తండ్రులు కాబోతున్నారు రామ్ చరణ్ -ఉపాసన(Ram Charan- upasana). దాంతో మెగా ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నారు. ఉపాసనను బంగారు బొమ్మలా చూసుకుంటున్నారు. అయితే నెటిజన్లకు మాత్రం ఓ అనుమానం ఉంది. ఉపాసన ఏడునెలల్ గర్బవతి అయితే... బేబీ బంప్ ఎందుకు కనిపించడంలేదు అని. ఈ విషయంలో ఆమె ఏం క్లారిటీ ఇచ్చిందంటే..?

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో రామ్ చరణ్ ఉపాసన కూడా ఉన్నారు. జంటగా కనిపిస్తూ..ఫ్యాన్స్ కు కనువిందు చేస్తుంటారు. అయితే వీరి పెళ్ళి అయ్యి 11 ఏళ్లు అవుతుండగా.. మొన్నటి వరకూ వీరికి పిల్లలు లేరు అని ట్రోల్ చేశారు కొంత మంది నెటిజన్లు. వారి ట్రోల్స్ కు సమాధానం చెపుతూ.. సమాజం కోసం కాదు.. మాకోసం మాకు నచ్చిన టైమ్ లో పిల్లల్ని కంటాం అని సమాధానం చెప్పింది ఉపాసన అనుకున్నట్టే తల్లి కాబోతోంది.

ఇక ప్రస్తుతం ప్రగ్నెంట్ గా ఉన్న ఉపాసన భర్తతో కలిసి నచ్చిన చోటికి టూర్ కు వెళ్తూ.. హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తోంది. మొన్నటి వరకూ బిజీగా ఉన్న రామ్ చరణ్.. ఇప్పుడు ఉపాసనకు టైమ్ కేటాయించాడు. ఆమెతో ప్రేమగా గడుపుతున్నాడు. అటు ఉపాసన కూడా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. బరువు పెరగకుండా... డైట్ ఫాలో అవుతూనే.. బిడ్డకు కావల్సిన పోషకాహారాన్ని తీసుకుంటుంది. ఈ విషయం ఆమె స్వయంగా వెల్లడించింది.

ఇక ఇప్పుడు ఆమె తల్లి అవుతున్న సందర్భంగా కూడా వారిపై విమర్షలు తప్పడంలేదు. ఉపాసన సరోగసి ద్వారా బిడ్డను కంటుందని.. డెలివరి కూడా అమెరికాలో అంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి. దానికి తగ్గట్టు ఉపాసన బేబీ బంప్ కూడా కనిపించకపోవడంతో.. నెటిజన్లలో అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఈక్రమలో ఉపాసన ఈ రూమర్స్ పై స్పందించింది.

కాగా ఏడు నెలలు అవుతున్నా ఉపాసన గర్భం కనిపించదేమని కొందరి సందేహం. ఉపాసన తల్లి అయ్యారని ప్రకటించి నాలుగు నెలలు దాటిపోగా ఆమెకు ఏడో నెలని పలువురి అభిప్రాయం. ఈ క్రమంలో ఉపాసనకు గర్భం కనిపించాలి కదా అంటారు కొందరు. దీనికి ఉపాసన పరోక్షంగా సమాధానం చెప్పారు.

తన శరీరానికి తగినట్లు ప్రతేకమైన బట్టలు వేసుకుంటుందట ఉపాసన. అంతే కాదు వాటికి తగ్గట్టుగానే ఆభరణాలు ధరిస్తానని ఉపాసన వెల్లడించారు. అంటే బేబీ బంప్ కనిపించకపోవడానికి ఆమె వేసుకునే బట్టలే కారణం అంటూ.. ఇండైరెక్ట్ గా సమాధానం చెప్పారు ఉపాసన. ఓ ఆభరణాల షో రూమ్ లాంఛింగ్ ఈవెంట్లో పాల్గొన్న ఉపాసన ఈ కామెంట్స్ చేశారు.

ఇక అమెరికాలో డెలివరీ అనే విషయం.. సరోగసి విషయంలో గతంలోనే స్ట్రాంగ్ గా సమాధానం చెప్పింది మెగా కోడలు. తన డెలివరీ ఇండియాలోనే అని.. అది కూడా అపోలో హాస్పిటల్ లోనే తన మొదటి బిడ్డను కంటానంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది ఉపాసన. దాంతో ట్రోలింగ్ కు పుల్ స్టాప్ పడింది.

Updated On 18 April 2023 11:53 PM GMT
Ehatv

Ehatv

Next Story