టాలీవుడ్ స్వీట్ కపుల్‌ రాంచరణ్‌(Ram charan)-ఉపాసన(Upasana) దంపతుల గారాలపట్టి క్లింకారా(Klin kara) పుట్టినరోజు నేడు.

టాలీవుడ్ స్వీట్ కపుల్‌ రాంచరణ్‌(Ram charan)-ఉపాసన(Upasana) దంపతుల గారాలపట్టి క్లింకారా(Klin kara) పుట్టినరోజు నేడు. దీంతో మెగా కుటుంబంలో(Mega family) సంబరాలు చేసుకుంటున్నారు. మరోసారి మెగా కుటుంబం కోలాహాలంగా మారింది. ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. క్లింకారకు మెగా ఫ్యాన్స్‌తో పాటు పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. తమ గారాల కూతురు తొలి పుట్టినరోజు సందర్భంగా గత 12 ఏళ్ల వారి వైవాహిక జీవితానికి సంబంధించిన ఓ ఎమోషనల్‌ వీడియోను ఉపాసన ఇన్‌స్టాలో పోస్టుచేసింది. ఈ సందర్భంగా నా ముద్దుల కూతురు క్లింకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు, నీ రాకతో మా జీవితాలు మరింత సంతోషమయైనవి అని పోస్టులో రాసుకొచ్చారు. ఈ వీడియోలో తమ పెళ్లి, ప్రెగ్నెన్సీ నుంచి బేబీ పుట్టేంతవరకు తమ అనుభూతులను అందులో రాసుకొచ్చారు.

ఉపాసన, చరణ్‌ కుటుంబసభ్యులు క్లింకార గురించి వివరించారు. ఈ సందర్భంగా రాంచరణ్ కూడా కొంత భావోద్వేగానికి లోనయి మాట్లాడారు. 11 ఏళ్లవుతుంది. ఇంకా ఏం చేస్తున్నారు.. పిల్లల గురించి అందరూ అడిగేవారన్నారు. క్లింకారాను ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పుడు చెప్పలేని అనుభూతిని పొందానని ఆయన వివరించారు. ప్రెగ్నెన్సీ కన్ఫాం అయినప్పటి నుంచి బీబీ పుట్టేంతవరకు తను పొందిన అనుభావాలను రాంచరణ్ తెలిపారు. పాప పుట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి మనవరాలి పేరు క్లింకారా అని ప్రకటించేవరకు జరిగిన మధురానుభూతులను వీడియోలో వివరించారు. ఈరోజు సోషల్‌ మీడియాలో ఈ వీడియో ట్రెండవుతోంది.




Updated On 20 Jun 2024 6:42 AM GMT
Eha Tv

Eha Tv

Next Story