రాజకీయాల్లోకి వచ్చిన తమిళ హీరో విజయ్‌కు(Vijay thalapathy) ఉపాసన(Upasana) అభినందనలు తెలిపారు. రాజకీయాల్లో సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. సోషల్‌ మీడియాలో(Social media) చాలా యాక్టివ్‌గా ఉండే ఉపాసన ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుత రాజకీయాలపై తన అభిప్రాయాలను చెప్పారు. 'సినిమారంగానికి చెందిన చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. రాణించారు. కొందరు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. నటుడిగా విజయ్‌ ఎంతో మంది మనసులను గెల్చుకున్నారు.

రాజకీయాల్లోకి వచ్చిన తమిళ హీరో విజయ్‌కు(Vijay thalapathy) ఉపాసన(Upasana) అభినందనలు తెలిపారు. రాజకీయాల్లో సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. సోషల్‌ మీడియాలో(Social media) చాలా యాక్టివ్‌గా ఉండే ఉపాసన ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుత రాజకీయాలపై తన అభిప్రాయాలను చెప్పారు. 'సినిమారంగానికి చెందిన చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. రాణించారు. కొందరు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. నటుడిగా విజయ్‌ ఎంతో మంది మనసులను గెల్చుకున్నారు. ఇప్పుడు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారంటే చాలా గొప్ప విషయం. సమాజంలో మార్పు రావాలని కోరుకునే నాయకుడు ఎవరైనా సరే మద్దతు ఇవ్వాల్సిందే. మద్దతు ఇవ్వకపోతే పోనివ్వండి .. వెనక్కి మాత్రం లాగకూడదు. విజయ్‌ గొప్ప నేత అవుతారని భావిస్తున్నాను' అని ఉపాసన తెలిపారు. తాను మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటానని, మార్పు తెచ్చే నాయకుడికి మద్దతు ఇస్తానని ఉపాసన తెలిపారు. సినిమాల గురించి కూడా ఉపాసన మాట్లాడారు. 'నేను తెలుగు, తమిళ సినిమాలను సబ్ టైటిల్స్‌తో చూస్తాను. ఇటీవల చాలా సినిమాను చూశాను. గేమ్‌ ఛేంజర్‌, ఇండియన్‌ 2 సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నాను. గేమ్‌ ఛేంజర్‌(Game changer) షూటింగ్‌ సమయంలోనే మాకు పాప పుట్టింది. అందుకే ఆ సినిమా మాకు ఎంతో ప్రత్యేకం. రామ్‌చరణ్‌కు ఆస్కార్‌ వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్‌లోకి వెళితే అక్కడ అందరూ నాటునాటు స్టెప్‌ వేసి అలరించారు. నాకు చాలా ఆనందమేసింది' అని ఉపాసన తెలిపారు.

Updated On 8 Feb 2024 4:05 AM GMT
Ehatv

Ehatv

Next Story