బిజినెస్ ఉమెన్ , మెగా కోడలు అయిన ఉపాసన కామినేని కొణిదెల (upsana konidela) ప్రస్తుతం గర్భవతి అయిన సంగతి తెలిసిందే. జూలైలో ఆమె తన మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. అయితే పెళ్లయిన దశాబ్ద కాలం తర్వాత పిల్లలను ప్లాన్ చేసుకోవడంపై ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. రామ్ చరణ్ (ramcharan) తన ప్రొఫెషనల్ కెరీర్‌లో ముందుకు వెళ్లే క్రమంలో , పిల్లలు పుట్టడానికి ఇదే సరైన సమయం అని చరణ్‌తో కలిసి వారిద్దరూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఉపాసన . ప్రస్తుతం ప్రెగ్నెన్సీ దశలో ఉన్న ఆమెకు చరణ్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాడు. కానీ గర్భవతిగా ఉన్నప్పుడు కూడా తన వృత్తి జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న ఉపాసన… ఉద్యోగం చేసే తల్లులకు స్ఫూర్తిగా నిలవాలనుకుంటోంది.

మాతృత్వం కూడా సాధారణ సమయాల మాదిరిగానే ఉండాలని, భిన్నంగా ఉండకూడదని ఉపాసన అభిప్రాయపడ్డారు ఆమె తన బిడ్డను ఇంకా కెరీర్‌ను ఒకే సమయంలో సమర్థవంతంగా చూసుకోవడంలో సమతుల్యతను సాధించాలని కోరుకుంటున్నట్లు భావిస్తున్నారు . వీలైనంత ఎక్కువ మంది తల్లులను తిరిగి వర్క్‌ఫోర్స్‌లోకి తీసుకురావడానికి తనను తాను ఉదాహరణగా చూపించే ఆలోచనలో ఉన్నట్లు ఆమె చెప్పింది. అంతేకాదు ఈ కార్పోరేట్ ప్రపంచంలో మాతృత్వంపై అవగాహన తీసుకురావడమే తన ధ్యేయమని ఉపాసన చెప్పడం జరిగింది .
ఆరు నెలల ప్రసూతి సెలవులపై ఉపాసన తన అభిప్రాయాన్ని వెల్లడించింది. మూడు, తొమ్మిది నెలలు ఎందుకు ఉండకూడదు.. వ్యక్తిగతీకరించడం ఎందుకు సాధ్యం కాదు? నిజానికి ఇండియాలో చాలా తక్కువ ధరకే హెల్త్ కేర్ లభిస్తోంది.. ఆ సేవలను అందిస్తున్న వివిధ ఛానెల్స్ గురించి తప్పక తెలుసుకోవాలి. ఉపాసనకు అలాంటి సపోర్టుకు తాను ఇప్పటికే సిద్ధంగా ఉన్నందున డెలివరీని తన సొంత కంపెనీ చూసుకుంటుందని, అందుకే తన కంపెనీ ఇన్సూరెన్స్ ఆమెకు వర్తిస్తుందని చెప్పింది. అందుకే ప్రసవానికి కూడా బీమా వినియోగిస్తానని ఆమె చెప్పడం ఇప్పుడు సంచలన టాపిక్ అయ్యింది .
ఇదిలా ఉంటే ఇటీవల ఉపాసన తన భర్త రామ్ చరణ్‌తో కలిసి దుబాయ్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడే తన సన్నిహితులు, బంధువులతో కలిసి సీమంతం జరుపుకుంది. టెడ్డీబేర్ థీమ్‌లో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్‌లో వైరల్‌గా మారాయి.