మిల్కీ బ్యూటీ అని తమన్నా భాటియాను(Tamannaah Bhatia) ఉత్తిగే అనలేదు. ఆమెది నిజంగానే పాలమీగడ సొగసు. సినీ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఎంత అందంగా, ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. అదే గ్రేస్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. ఇప్పుడు కూడా వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. మూడు పదుల వయసు దాటిన తమన్నా కెరీర్‌ లాస్ట్ స్టేజ్‌లో ఉందని అనుకున్నారు చాలా మంది. సరిగ్గా ఇదే సమయంలో ఓటీటీలో లస్ట్‌ స్టోరీస్‌-2(Lust stories-2) , జీ కర్దా(Zee Kardha) వెబ్‌ సిరీస్‌లు చేశారు తమన్నా.

మిల్కీ బ్యూటీ అని తమన్నా భాటియాను(Tamannaah Bhatia) ఉత్తిగే అనలేదు. ఆమెది నిజంగానే పాలమీగడ సొగసు. సినీ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఎంత అందంగా, ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. అదే గ్రేస్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. ఇప్పుడు కూడా వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. మూడు పదుల వయసు దాటిన తమన్నా కెరీర్‌ లాస్ట్ స్టేజ్‌లో ఉందని అనుకున్నారు చాలా మంది. సరిగ్గా ఇదే సమయంలో ఓటీటీలో లస్ట్‌ స్టోరీస్‌-2(Lust stories-2) , జీ కర్దా(Zee Kardha) వెబ్‌ సిరీస్‌లు చేశారు తమన్నా. అయితే ఇప్పటివరకు అందాల ఆరబోతలో కాసింత బెట్టగా ఉన్న తమన్నా ఓటీటీల్లోని వెబ్‌ సిరీస్‌లలో మాత్రం ఓపెన్‌ అయ్యారు. ముద్దు సన్నివేశాలలో, శృంగార సన్నివేశాలలో రెచ్చిపోయారు. అందుకే తరచూ ఆమె న్యూస్‌లో ఉంటున్నారు. ఇప్పటికీ చాలా మంది ఆ విషయమే మాట్లాడుకుంటున్నారు. తెలుగులో శ్రీ(Sree) సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన తమన్నాకు హ్యాపీడేస్‌(Happydays) మంచి గుర్తింపును తెచ్చింది. హండ్రెడ్‌పర్సంట్‌ లవ్‌(100% Love) సినిమాతో హిట్‌ కొట్టారు. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. అగ్ర హీరోల సరసన నటించి టాప్‌ స్టార్‌ అయ్యారు. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఈమె చిరంజీవితో(Chiranjeevi) నటించిన భోళాశంకర్‌(Bholashankar), రజనీకాంత్‌తో(Rajinikanth) నటించిన జైలర్‌(Jialer) సినిమాలో కేవలం ఒక్క రోజు గ్యాప్‌లో విడుదల కాబోతున్నాయి.
అయితే ఈ మధ్య తమన్నా చేతికి డైమండ్‌తో ఉన్న ఫొటో ఒకటి వైరల్ అయింది. దీన్ని రామ్‌చరణ్‌ భార్య ఉపాసన(Upasana) ఆమెకి కానుకగా ఇచ్చారని, ప్రపంచంలోనే ఇది అయిదో ఖరీదైన వజ్రం అని, దీని ఖరీదు రెండు కోట్ల రూపాయలకుపైగానే ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ విషయం తమన్నాకు కూడా తెలిసింది. వెంటనే ఆమె దీనిపై స్వయంగా స్పందించారు. అబ్బే ఇది వజ్రం కాదని, సోడా బాటిల్‌ ఓపెనర్‌(Bottle Opener) అని క్లారిటీ ఇచ్చారు. ఇది బాగుందని ఫోటోలకు పోజులిచ్చానని తెలిపారు. అప్పటి వరకు ఏదేదో ఊహించుకున్న నెటిజన్లు.. తమన్నా మాటలతో ఉసూరుమన్నారు.

Updated On 26 July 2023 12:30 AM GMT
Ehatv

Ehatv

Next Story