సినిమా.. సినిమా.. సినిమా.. ఈ మూడు పదాల కలను నిజం చేసుకోవడం కోసం ఎందరో యజ్ఞం చేస్తుంటారు. ఎప్పటికో ఆ యజ్ఞం పూర్తవుతుంది. అంతా చేసినా కూడా చివరికి అది థియేటర్లలోకి రావడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయితే అన్నింటిని దాటుకుని తీరా థియేటర్లలోకి వచ్చిన వెంటనే పైరసీ భూతం వెంటాడుతుంటుంది. ఇంకేముంది? ఇటు సినిమా తీసిన నిర్మాత (Producer), డైరెక్టర్ (Director) అనే దీపం అక్కడే ఆరిపోతుంది. ఆ దీపాన్ని కాపాడుకునేందుకు ఎళ్లతరబడి ఫిల్మ్ ఇండస్ట్రీ (Film Industry) శ్రమిస్తోంది.

సినిమా.. సినిమా.. సినిమా.. ఈ మూడు పదాల కలను నిజం చేసుకోవడం కోసం ఎందరో యజ్ఞం చేస్తుంటారు. ఎప్పటికో ఆ యజ్ఞం పూర్తవుతుంది. అంతా చేసినా కూడా చివరికి అది థియేటర్లలోకి రావడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయితే అన్నింటిని దాటుకుని తీరా థియేటర్లలోకి వచ్చిన వెంటనే పైరసీ భూతం వెంటాడుతుంటుంది. ఇంకేముంది? ఇటు సినిమా తీసిన నిర్మాత (Producer), డైరెక్టర్ (Director) అనే దీపం అక్కడే ఆరిపోతుంది. ఆ దీపాన్ని కాపాడుకునేందుకు ఎళ్లతరబడి ఫిల్మ్ ఇండస్ట్రీ (Film Industry) శ్రమిస్తోంది. అయినా పైరసీ అనే విషవాయువు ఆ దీపాన్ని ఆర్పేస్తుంది. ఇక ఆ వాయువు భరతం పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త యాక్ట్ తీసుకొస్తుంది.

ఇంటర్నెట్లో చట్ట విరుద్ధంగా సినిమాలను సైరసీ (Piracy) చేసేవాళ్ల ఆటలు ఇక సాగవంటోంది కేంద్ర ప్రభుత్వం. పైరసీని నిరోధించే నిబంధనలతో కూడిన 'సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు 2023'కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రస్తుత సినిమాలకు U,A,UA సెన్సార్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అయితే ఏజ్‏ను బేస్ చేసుకుని కొత్త కేటగిరీలను ఈ బిల్లులో చేర్చామన్నారు.

ఈ బిల్లుపై వివిధ పార్టీలతో విస్తృతంగా చర్చలు జరిపామన్నారు. సినిమాల పైరసీని అడ్డుకునేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది. అయితే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత అందులోని సెక్షన్ల మీద ఒక స్పష్టత వస్తుందన్నారు. పెద్ద వయస్సు వాళ్లు చూసే చిత్రాల కోసం 'A', వైద్యులు, పరిశోధకులు వంటి ప్రేక్షకుల చిత్రాల కోసం 'S', పెద్దలతో కలిసి చూసే సినిమాలకు U/A సర్టిఫికెట్ ఇవ్వబడుతుందన్నారు. UA7+, UA13+, UA16+ సర్టిఫికెట్లు పెద్దలకు మాత్రమే అనే కేటగిరీల్లో సెన్సార్ చేయడం జరుగుతుందన్నారు.

సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్ల విధానాలను మెరుగుపర్చడంతోపాటు సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఉండేందుకు ఈ బిల్లును తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా 'క్వాంటం' (Quantum) టెక్నాలజీని అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కేంద్రం కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. 2023-24 నుంచి 2030-31 వరకు 6,003.65 కోట్ల రూపాయల కాస్ట్ తో చేపట్టనున్న ప్రాజెక్టులు 'క్వాంటం' (Quantum) టెక్నాలజీ ఆధారంగా ఆర్థిక వృద్ధిని స్పీడ్ అప్ చేస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్ (Jitendra Singh) తెలిపారు. ఈ స్కీమ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్, హెల్త్, ఫైనాన్స్, ఎనర్జీ, డ్రగ్ డెవలప్ మెంట్ వంటి రంగాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఆయన.

ఎయిత్ ఇండియా, ఎఫిషియంట్ ఇండియా, ఇన్నోవేటివ్ ఇండియా, సస్టైనబుల్ ఇండియా స్కీమ్‏లకు మంచి బూస్టప్ ఇస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్వహణకు ప్రముఖ శాస్త్రవేత్త లేదా, ఆ రంగంలోని పారిశ్రామికవేత్త నేతృత్వం వహిస్తారని ఆయన అన్నారు.

Updated On 20 April 2023 12:45 AM GMT
Ehatv

Ehatv

Next Story