దర్శకుడు మారీ సెల్వరాజ్(Mari Selvaraj) సినిమాలు విలక్షణంగా ఉంటాయి. ఆయన సినిమాలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. ప్రస్తుతం కోలీవుడ్ నటుడు ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) హీరోగా తమిళంలో మామన్నన్(Maamannan) సినిమాను తెరకెక్కించారు మారీ సెల్వరాజ్. ఇందులో వడివేలు(Vadivelu) ప్రధాన పాత్రను పోషించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా గత నెల 29న విడుదలయ్యింది. బ్రహ్మండమైన విజయాన్ని అందుకుంది.
దర్శకుడు మారీ సెల్వరాజ్(Mari Selvaraj) సినిమాలు విలక్షణంగా ఉంటాయి. ఆయన సినిమాలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. ప్రస్తుతం కోలీవుడ్ నటుడు ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) హీరోగా తమిళంలో మామన్నన్(Maamannan) సినిమాను తెరకెక్కించారు మారీ సెల్వరాజ్. ఇందులో వడివేలు(Vadivelu) ప్రధాన పాత్రను పోషించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా గత నెల 29న విడుదలయ్యింది. బ్రహ్మండమైన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను నాయకుడు పేరుతో తెలుగులోకి అనువదించారు. ఏషియన్ మల్టిప్లెక్స్ ప్రైవేటు లిమిటెడ్, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నాయి. ఈ నెల 14న తెలుగు రాష్ట్రాలలో విడుదల కాబోతున్నది. ఉదయనిధి స్టాలిన్‌కు ఇది చివరి సినిమా కాబోతున్నది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం తమిళనాడులో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాజకీయాలలో బిజీగా ఉన్న ఆయన ఇకపై సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చివరి చిత్రంగా మామన్నన్ సినిమా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. సమాజంలోని కుల వ్యవస్థ, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఫహాద్ ఫాజిల్ ఇందులో ప్రతినాయకుడిగా నటించారు. కీర్తి సురేశ్ కథానాయిక. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. జూన్ 29న కోలీవుడ్‌లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమా కథ ఏమిటంటే, అణగారిన వర్గానికి చెందిన మామన్నన్ తన మంచితనంతో ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవలు చేస్తుంటాడు. అతడి కుమారుడు వీరన్ అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. కులవ్యవస్థ వల్ల చిన్నతనంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. లీలాతో ప్రేమలో పడతాడు. సేవా కార్యక్రమాలు చేసే లీలాను అగ్రకులానికి చెందిన రత్నవేలు తరచూ ఇబ్బందులు పెడుతుంటారు. దీంతో, ఆమెకు సాయం చేసేందుకు మామన్నన్, వీరన్ రంగంలోకి దిగుతారు. ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? రత్నవేలుకు వాళ్లు ఎలా బుద్ధి చెప్పారు? అనే ఆసక్తికర అంశాలతో ఇది తెరకెక్కింది. మామన్నన్‌గా వడివేలు నటించారు. వీరన్‌గా ఉదయనిధి స్టాలిన్, లీలగా కీర్తి సురేశ్, రత్నవేలుగా ఫహిద్ ఫాజిల్ నటించారు.