ఎనిమిదో దశకం చివర్లో దూరదర్శన్‌లో వచ్చిన ఉడాన్(Udan) సీరియల్‌ను ఆనాటి తరంవారు ఆసక్తిగా వీక్షించారు. సూపర్‌హిట్ అయిన ఈ సీరియల్‌లో ఐపీఎస్ అధికారిణి పాత్రలో నటించిన కవితా ఛౌదరి(Kavita Chaudhary) కన్నుమూశారు. 67 ఏళ్ల కవిత అమృత్‌సర్‌లోని పార్వతీదేవి ఆసుపత్రిలో కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచారు.
ఎనిమిదో దశకం చివర్లో దూరదర్శన్‌లో వచ్చిన ఉడాన్(Udan) సీరియల్‌ను ఆనాటి తరంవారు ఆసక్తిగా వీక్షించారు. సూపర్‌హిట్ అయిన ఈ సీరియల్‌లో ఐపీఎస్ అధికారిణి పాత్రలో నటించిన కవితా ఛౌదరి(Kavita Chaudhary) కన్నుమూశారు. 67 ఏళ్ల కవిత అమృత్‌సర్‌లోని పార్వతీదేవి ఆసుపత్రిలో కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె స్నేహితురాలు సుచిత్ర వర్మ తెలిపారు. కొన్నాళ్లుగా కవితా ఛౌదరి కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. గత ఏడాది ఆమెను తాను కలిశానని, ఆ సమయంలో కవిత తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారని సుచిత్ర వర్మ చెప్పారు. తన కీమోథెరపీ గురించి కూడా ఆమె తనకు చెప్పుకుని బాధపడ్డారని తెలిపారు. కవితను కోల్పోవడం అత్యంత విషాదకరమని, ఇక ఆమెను కలవలేనన్న బాధే తనను తీవ్రంగా కలిచివేస్తోందని సుచిత్ర వర్మ అన్నారు. ఆమె ఆరోగ్యం ఇంత హఠాత్తుగా ఇంతగా క్షీణిస్తుందని అసలు అనుకోలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) పోస్టు పెట్టారు సుచిత్ర వర్మ.