టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేను చాలా గ్రాండ్ గా జరిపేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బర్త్ డే సందర్భంగా పవర్ స్టార్ కెరీర్‌లో బాగా స్పెషల్ గా నిలిచిన రెండు రసినిమాలు రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ సినిమాల్లో వెరీ స్పెషల్ సినిమా అంటే.. గుడుంబా శంకర్ (Gudumba Shankar)పక్కాగా ఉంటుంది ఈమూవీ రీరిలీజ్ చేస్తున్నారని ముందే అందరికి తెలుసు..

Pawan kalyan Birthday
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) బర్త్ డే(Birthday) ఈసారి చాలా స్పెషల్ కాబోతోంది. ఈసారి ప్యాన్స్ కోసం మేకర్స్ డబుల్ ట్రీట్ రెడీ చేస్తున్నారు. సర్ ప్రైజ్ రిలీజ్ ఇవ్వబోతున్నారు.
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేను చాలా గ్రాండ్ గా జరిపేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బర్త్ డే సందర్భంగా పవర్ స్టార్ కెరీర్‌లో బాగా స్పెషల్ గా నిలిచిన రెండు రసినిమాలు రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ సినిమాల్లో వెరీ స్పెషల్ సినిమా అంటే.. గుడుంబా శంకర్ (Gudumba Shankar)పక్కాగా ఉంటుంది ఈమూవీ రీరిలీజ్ చేస్తున్నారని ముందే అందరికి తెలుసు.. ఈసినిమా ఆగస్టు 31, సెప్టెంబర్ 1న రీరిలీజ్ కాబోతుందని నాగబాబు ముందే వెల్లడించారు.
కాగా ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపడానికి పవర్ స్టార్ కు సబంధించిన మరో సినిమా రిలీజ్ చేయడానికి సై అంటున్నారు. కల్యాణ్ అభిమానుల్లో మరింత జోష్ నింపే మరో అప్‌డేట్ ఒకటి హల్ చల్ చేస్తోంది. సరైన హిట్స్ లేని పవన్ కల్యాణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం గబ్బర్ సింగ్(Gabbar Singh). హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి.. నిర్మాతకు కాసుల పంట పండించింది. గబ్బర్ సింగ్ సినిమా కూడా రీరిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని నిర్మాత బండ్ల గణేశ్ తెలియజేశారు. ఈ లెక్కన పవన్ కల్యాణ్ బర్త్ డేన ఒకేసారి రెండు సినిమాలు విడులవుతాయా..? అనేది చూడాలంటున్నారు ఫ్యాన్స్.
