మలయాళ టీవీ నటి నిత్యా శశి(Nitya Sasi) అడ్డదారులు తొక్కింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. కేరళలోని పాతనమిట్ట ప్రాంతానికి చెందిన ఈ 32 ఏళ్ల నటి టీవీ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్స్(Serials) ద్వారా వచ్చే డబ్బు సరిపోదని అనుకుందో, లేక సునాయసంగా డబ్బు సంపాదించాలని భావించిందో తెలియదు కానీ తన స్నేహితుడు బినుతో(Binu) కలిసి చేయకూడని పనులు చేసింది. తిరువనంతపురంలో(Thiruvananthapuram) ఉండే విశ్రాంత ఆర్మీ(Retired Army) ఉద్యోగికి తన స్నేహితుడితో కలిసి వల వేసింది.

ఇల్లు అద్దెకు కావాలంటూ ఆ 75 ఏళ్ల సీనియర్ సిటిజన్‌తో నిత్య పరిచయం పెంచుకుంది. ఆయనను ట్రాప్ చేసి డబ్బులు గుంజాలనుకుంది. కాకపోతే ఆ ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు దొరికిపోయింది. కిరాయికి ఇల్లు కావాలంటూ సదరు వృద్దుడిని సంప్రదించింది నిత్యాశశి. అలా పరిచయం చేసుకుంది. ఆ పరిచయంతో ప్రతీరోజు ఆయనకు ఫోన్ చేసేది. అలా ఫ్రెండ్‌షిప్‌ను బలోపేతం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత ఓ రోజు కలకోటేలోని తన అద్దె ఇంటికి రావాల్సిందిగా ఆ వృద్ధుడిని నిత్య పిలిచింది.
నిత్య ఆహ్వానాన్ని మన్నించి ఆ వృద్ధుడు ఆమె ఇంటికి వెళ్లాడు. తర్వాత ఏం జరిగిందో ఆ వృద్దుడు పోలీసులకు సవివరంగా చెప్పాడు.. ఆయన ఏమన్నాడంటే...'నిత్యా శశి ఇంటికి నేను వెళ్లగానే నన్న మాటల్లో ఉంచింది.. మెల్లగా నా దుస్తులు తొలగించింది. ఆపై ఆమె కూడా దుస్తులు తొలగించుకుంది. ఇంతులో నిత్య స్నేహితుడు బిను వచ్చాడు. నా ఫోటోలతో పాటు ఇద్దరం ఉన్న ఫోటోలను కొన్ని తీశాడు. ఆపై అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని వారిద్దరూ బెదిరించడం మొదలు పెట్టారు. పరువుపోతుందన్న ఉద్దేశంతో ఇప్పటికే వారికి 11 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాను.
కానీ వారు పాతిక లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అంత డబ్బు నా దగ్గర లేదని, ఇక ఇవ్వలేనని చెప్పారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని మళ్లీ బెదిరించారు' అని వృద్ధుడు ఆవేదనతో కూడిన స్వరంతో చెప్పాడు. పోలీసులు ఇచ్చిన సూచన మేరకు ఆ వృద్ధుడు పాతిక లక్షల రూపాయలు ఇస్తానని వారిద్దరికి చెప్పాడు. ఆ డబ్బు తీసుకోవడానికి తన ఇంటికి రావాల్సిందిగా చెప్పాడు. పక్కా ప్లాన్‌తో పోలీసులు అక్కడే ఉండి నిత్యాశశి, బినులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారిద్దరిని కోర్టులో హాజరుపరిచారు. నిత్య చాలా సీరియల్స్‌లో నటించింది. మలయాళంలో అనేక షోలలో కూడా కనిపించింది. వాటితో సంపాదించిన ఫేమ్ మొత్తం ఈ దెబ్బతో పోయింది.