తెలుగు టీవీ పరిశ్రమలో విషాద ఘటన చోటు చేసుకుంది. సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లోని అల్కాపూరి కాలనీలోని తన నివాసంలో చందు శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలుగు టీవీ పరిశ్రమలో విషాద ఘటన చోటు చేసుకుంది. సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌లోని అల్కాపూరి కాలనీలోని తన నివాసంలో చందు శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చందు తెలుగులో త్రినయని, కార్తీక్ దీపం, రాధమ్మ కూతురు వంటి సీరియల్స్‌లో నటించాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్‌తో చందుకు ఆరేళ్లుగా దగ్గర అనుబంధం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల పవిత్ర జయరామ్, చందు ఇద్దరు బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా.. మహబూబ్ నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆమె మరణించారు. ఈ నేపథ్యంలోనే పవిత్ర మృతిని తట్టుకోలేక చందు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. యాక్టర్ చందు మరణవార్త తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. చందు ఆకస్మాత్తుగా సూసైడ్ చేసుకోవడానికి గల కారణమేంటనే దానిపై సస్పెన్స్ నెలకొంది. మరోవైపు చందు, పవిత్ర జయరామ్‌ల మరణాలతో టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.