ప్రతినాయకుడి పాత్రలతో ఫేమస్‌ అయిన ప్రముఖ నటుడు భూపిందర్‌సింగ్‌(Bhupinder Singh)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన పొలం సరిహద్దుల్లో చెట్లు నరికే విషయంలో వివాదం తలెత్తడంతో భూపిందర్‌సింగ్‌ తన రివాల్వర్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రతినాయకుడి పాత్రలతో ఫేమస్‌ అయిన ప్రముఖ నటుడు భూపిందర్‌సింగ్‌(Bhupinder Singh)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన పొలం సరిహద్దుల్లో చెట్లు నరికే విషయంలో వివాదం తలెత్తడంతో భూపిందర్‌సింగ్‌ తన రివాల్వర్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని బిజ్నోర్‌(Bijnor)లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని కౌన్‌కేదా ఖాద్రీ గ్రామంలో భూపిందర్‌ సింగ్‌ ఫామ్‌ హౌస్‌ ఉంది. దీని పక్కనే గుర్దీప్‌సింగ్‌ నివాసం ఉంటున్నారు. ఇద్దరి స్థలాల సరిహద్దులో కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లను తొలగించే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ మొదలయ్యింది. ఆవేశంలో భూపిందర్‌ సింగ్‌ లైసెన్స్‌డ్‌ పిస్టోల్‌తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గుర్‌దీప్‌ సింగ్‌, అతడి భార్య మీరాబాయి, కొడుకు బూటాసింగ్‌ తీవ్రంగా గాయపడ్డారు. మరో కుమారుడు గోబింగ్‌ సింగ్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. జై మహాభారత్‌ సీరియల్‌తో కెరీర్‌ మొదలుపెట్టిన భూపిందర్‌సింగ్‌ తర్వాత ఏక్‌ హసీనా థీ, తేరే షెహర్‌ మే, మధుబాల-ఏక్‌ ఇష్క్‌ ఏక్‌ జనూన్‌ వంటి సీరియల్స్‌లో నటించాడు. తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్‌ పాత్రలు పోషించాడు. తమ్ముడు, అన్నయ్య, దేవిపుత్రుడు, భలేవాడివి బాసు, విలన్‌, అంజి, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ వంటి సినిమాల్లో నటించాడు. 2010లో సోచ్‌ లో అనే హిందీ సినిమాలో చివరిసారిగా కనిపించిన భూపిందర్‌ సింగ్‌ తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు.

Updated On 6 Dec 2023 12:54 AM GMT
Ehatv

Ehatv

Next Story