మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam tej) మళ్లీ గాడిలో పడ్డారు. విరూపాక్ష(Virupaksha) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సాయి ధరమ్‌తేజ్‌కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తన మేనమామ పవన్ కల్యాణ్‌తో(Pawan Kalyan) కలిసి బ్రో (BRO)అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది తమిళ చిత్రానికి రీమేక్(Remake) అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pooja Hegde
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam tej) మళ్లీ గాడిలో పడ్డారు. విరూపాక్ష(Virupaksha) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సాయి ధరమ్‌తేజ్‌కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తన మేనమామ పవన్ కల్యాణ్‌తో(Pawan Kalyan) కలిసి బ్రో (BRO)అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది తమిళ చిత్రానికి రీమేక్(Remake) అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తిస్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటించబోతున్నారట. ఇప్పటికే నిర్మాత, దర్శకులు ఆమెను సంప్రదించినట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో సాయిధరమ్ తేజ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. పూజా హెగ్డేకు సంబంధించిన మరో వార్త కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది. గుంటూరు కారం(Guntur karam) సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకున్నారు కదా! ఆమె కాల్షీట్లు అడ్జెస్ట్ చేయలేక సినిమా నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది. అయితే హీరోయిన్‌గా గుంటూరు కారం నుంచి తప్పుకున్నా, ఆమెతో ఓ స్పెషల్ సాంగ్(special Song) చేయించాలని మేకర్స్ అనుకుంటున్నారట. బ్రో(BRO) సినిమా జులై 28న విడుదల కాబోతున్నది. ఈ సినిమాకు సముద్రఖని(Samuthirakani) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక గుంటూరుకారం విషయానికి వస్తే అతడు(athadu), ఖలేజా(Khaleja) చిత్రాల తర్వాత మహేశ్‌బాబు(Mahesh babu), త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కాబట్టి అంచానాలు ఎక్కువగానే ఉన్నాయి. ముందుగా ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా పూజా హెగ్డే, రెండో హీరోయిన్‌గా శ్రీలీలను(Sreeleela) తీసుకున్నారు. అయితే ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకున్నారు. దీంతో ప్రధాన కథానాయిక పాత్రను శ్రీలీలకు ఇచ్చారు. రెండో నాయికగా మీనాక్షి చౌదరిని(Meenakshi Chowdhary) తీసుకుంటున్నారనే టాక్ వినిపించింది కానీ మేకర్స్ నుంచి ఇంకా ప్రకటన రాలేదు.
