హీరోయిన్లు ఫెయిడ్ అవుట్ అయ్యి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా రీ ఎంట్రీలు.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం చూశాం కాని.. ఏజ్ అయిపోతున్న భ్యూటీ.. మళ్లీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వడం.. అది కూడా స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు రావడం ఒక్క త్రిష (Trisha) విషయంలోనే జరిగింది. పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan) సినిమాతో తనేంటో మరోసారి నిరూపించుకున్న బ్యూటీ.. తమిలంలో దళపతి విజయ్ జోడీగా నటిస్తోంది. అజిత్ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఇలా వరుస అవకాశాలు సాధిస్తూ.. ఇప్పుడ తెలుగులో కూడా అవకాశాలు అందుకుంటోంది.

తమిళంతో పాటు..టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా త్రిష ఒకప్పుడు వెలుగు వెలిగింది. ఇతర హీరోయిన్లకుపోటా పోటీగా. చక్రం తిప్పేసింది. అదే సమయంలో అంతే స్టార్ స్టేటస్ ను తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో చూసింది. చాలాకాలం పాటు ఆమె తన జోరును చూపించిన తరువాతనే, రెండు భాషల్లోను అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఆ సమయంలో ఆమె తమిళంలో విమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తూ వచ్చింది. మంచి మంచి సబ్జెక్ట్ లను ఎంచుకుంటూ వెళ్ళింది.

ఇక త్రిషకెరీర్ అయిపోతుంది పెళ్ళెప్పుడు అన్న ప్రశ్నలు వస్తుండగా.. త్రిష పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వినిపిస్తుండగా.. మళ్లీ పొన్నియిన్ సెల్వన్' సినిమాతో ఆమె పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె గ్లామర్ రెట్టింపు కావడం చూసి అంతా షాక్ అయ్యారు. దాంతో ఆమెకి కోలీవుడ్ సీనియర్ హీరోల సరసన మళ్లీ అవకాశాలు రావడం మొదలైంది. 'లియో' ఛాన్స్ కూడా అలా వచ్చిందే. ఈ సినిమాలోనూ త్రిష చాలా అందంగా కనిపించింది.

ఇక ఆమె టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల సరసన సందడి చేయడం కూడా ఖాయమని చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆమె బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. బాబీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను, సితార బ్యానర్ వారు నిర్మించనున్నారు. బాలయ్య (Balakrishna) ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

Updated On 23 Oct 2023 5:09 AM GMT
Ehatv

Ehatv

Next Story