చెన్నై సోయగం త్రిష(Trisha Krishnan) ఇప్పటికీ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. రెండు దశాబ్దాల కిందట వచ్చిన వర్షం సినిమాలో ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడూ అదే అందంతో ఉన్నారు. చెక్కు చెదరని అందంతో మెరిసిపోతున్నారు. నాలుగు పదుల వయసులోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ తరగని అందంతో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది. పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా ఆమెకు మళ్లీ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. మొదటిభాగం ఎంత పెద్ద హిట్టయ్యిందో రెండో భాగం కూడా అదే రేంజ్‌లో సూపర్‌హిట్టయ్యింది. లేస.. లేసా అనే తమిళ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ సంచలన నటి అక్కడ విక్రమ్‌ హీరోగా వచ్చిన సామి చిత్రంతో కమర్షియల్‌ సినిమాల హీరోయిన్‌ లిస్టులో చేరిపోయారు.

చెన్నై సోయగం త్రిష(Trisha Krishnan) ఇప్పటికీ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. రెండు దశాబ్దాల కిందట వచ్చిన వర్షం సినిమాలో ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడూ అదే అందంతో ఉన్నారు. చెక్కు చెదరని అందంతో మెరిసిపోతున్నారు. నాలుగు పదుల వయసులోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ తరగని అందంతో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది. పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా ఆమెకు మళ్లీ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. మొదటిభాగం ఎంత పెద్ద హిట్టయ్యిందో రెండో భాగం కూడా అదే రేంజ్‌లో సూపర్‌హిట్టయ్యింది. లేస.. లేసా అనే తమిళ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈ సంచలన నటి అక్కడ విక్రమ్‌ హీరోగా వచ్చిన సామి చిత్రంతో కమర్షియల్‌ సినిమాల హీరోయిన్‌ లిస్టులో చేరిపోయారు. ఆ తర్వాత వరుసగా సౌత్‌ ఇండియా అన్ని భాషల్లో నటిస్తూ అగ్ర నటి స్థాయికి ఎదిగారు. అలా 20 ఏళ్ల తన నట ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతోంది. మణిరత్నం దర్శకత్వంలో ఇటీవల త్రిష తన 40వ పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు . నటిగా త్రిష కెరీర్‌ సక్సెస్‌ బాటలో పయనిస్తున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం త్రిషపై ప్రేమకు సంబంధించిన వదంతులు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అప్పట్లో ఎంగేజ్‌మెంట్‌ వరకు వెళ్లిన ఆమె పెళ్లి విషయం ఆ తర్వాత ఎందుకో ఆగిపోయింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన స్నేహితులు కొందరు పెళ్లి చేసుకుని కొద్ది ఏళ్లకే విడాకులు గురించి మాట్లాడుకోవడం తన చెవికి చేరిందన్నారు. అందుకే తనతో జీవితాంతం సంతోషంగా కలిసి పయనించే వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కాగా త్రిష ఇటీవల తన ఇన్‌ స్ట్రాగామ్‌లో వరుసగా తాను పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు. ఆమెకు పెళ్లీ మీద దృష్టి మళ్లింది కాబోలని నెటిజన్లు సరదాగా అనుకుంటున్నారు. ప్రస్తుతం త్రిష దళపతి నటుడు విజయ్‌ సరసన లియో చిత్రంలో నటిస్తున్నారు. సుమారు 14 ఏళ్ల తర్వాత విజయ్‌, త్రిష కలిసి నటించిన సినిమా ఇది కావడం విశేషం. అలాగే అజిత్‌తో కలిసి విడాముయిర్చి చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారట!

Updated On 21 Aug 2023 8:34 AM GMT
Ehatv

Ehatv

Next Story