మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్(Ponniyan Selvan) మొదటి భాగం ఎంత హిట్టయ్యిందో , రెండో భాగం సినిమా కూడా అంతే విజయం సాధించింది. ఈ సినిమాతో చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్(Trisha Krishnan) మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. గ్లామరస్ పాత్రల్లో ఎంత అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారో, పర్‌ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌లోనూ అంతే బాగా నటిస్తారు త్రిష. ప్రస్తుతం దళపతి విజయ్(Thalapathy Vijay) హీరోగా లోకేశ్ కనగరాజ్(Lokesh nagraj) దర్శకత్వంలో వస్తున్న లియో(Leo) చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమా తర్వాత ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

Trisha krishnan
మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్(Ponniyan Selvan) మొదటి భాగం ఎంత హిట్టయ్యిందో , రెండో భాగం సినిమా కూడా అంతే విజయం సాధించింది. ఈ సినిమాతో చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్(Trisha Krishnan) మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. గ్లామరస్ పాత్రల్లో ఎంత అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారో, పర్‌ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌లోనూ అంతే బాగా నటిస్తారు త్రిష. ప్రస్తుతం దళపతి విజయ్(Thalapathy Vijay) హీరోగా లోకేశ్ కనగరాజ్(Lokesh nagaraj) దర్శకత్వంలో వస్తున్న లియో(Leo) చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమా తర్వాత ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. లియో సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలనుకుంటన్నారు.
ఇటీవలే త్రిష మరో సినిమాను కూడా ఒప్పుకున్నారు. అది కూడా మలయాళంలో! ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తాజా మలయాళ సినిమా పేరు ఐడెంటిటీ(Identity).. ఇందులో టోవినో థామస్(Tovino Thomas) హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అఖిల్ పాల్(Akhil Paul), అనస్ ఖాన్‌లు(Anas Khan) దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా సెట్స్‌లో త్రిష జాయిన్ కానున్నారు. ఈ ప్రాజెక్టు కోసం త్రిష 45 రోజులు డేట్స్ ఇచ్చారట. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయని చిత్ర యూనిట్ అంటోంది. ఈ యాక్షన్ పార్ట్‌లో త్రిష భాగం కానుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా కల్యాణ్ కృష్ణ(Kalyan Krishna) దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా త్రిష పేరును పరిశీలిస్తున్నారట. త్రిష ఒప్పుకుంటే మాత్రం స్టాలిన్(stalin) తర్వాత త్రిష- చిరంజీవి కాంబినేషన్‌లో రాబోతున్న రెండో సినిమా అవుతుంది.
గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైనర్‌పై చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
