రెండు దశాబ్దాల పాటు హీరోయిన్‌గా కొనసాగడం దాదాపు అసాధ్యం. హీరోయిన్ల కెరీర్‌ మహా అయితే పదేళ్లు ఉంటుందంతే! కానీ చెన్నై చంద్రం త్రిష(Trisha) మాత్రం ఇప్పటికీ అగ్రశ్రేణి కథనాయికగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇంకో విశేషమేమిటంటే ఇండస్ట్రీలో వచ్చిన తొలినాళ్లలో ఎంత అందంగా ఉన్నారో, ఇప్పుడూ అంతే అందంగా ఉండటం! కెరీర్‌లో కొన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయి కానీ వాటిని అధిగమిస్తూ ముందుకు దూసుకెళుతున్నారు త్రిష. ఎన్నో వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి.

రెండు దశాబ్దాల పాటు హీరోయిన్‌గా కొనసాగడం దాదాపు అసాధ్యం. హీరోయిన్ల కెరీర్‌ మహా అయితే పదేళ్లు ఉంటుందంతే! కానీ చెన్నై చంద్రం త్రిష(Trisha) మాత్రం ఇప్పటికీ అగ్రశ్రేణి కథనాయికగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇంకో విశేషమేమిటంటే ఇండస్ట్రీలో వచ్చిన తొలినాళ్లలో ఎంత అందంగా ఉన్నారో, ఇప్పుడూ అంతే అందంగా ఉండటం! కెరీర్‌లో కొన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయి కానీ వాటిని అధిగమిస్తూ ముందుకు దూసుకెళుతున్నారు త్రిష. ఎన్నో వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. అయినప్పటికీ ఆమె క్రేజ్‌ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. పరాజయాలతో ఇబ్బందిపడుతున్నప్పుడల్లా ఆమెకు ఓ బ్రహ్మండమైన సక్సెస్‌ వచ్చేది. ఆమెను మళ్లీ పూర్వ వైభవానికి తీసుకెళ్లేది. ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్​ సెల్వన్(Ponniyin Selvan) సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. అంతకు ముందు వరుసగా ఫ్లాపులు వెంటాడుతున్న త్రిషకు పొన్నియన్‌ సెల్వన్‌తో మళ్లీ టాప్‌లోకి వచ్చారు. ప్రస్తుతం తమళంలో దళపతి విజయ్‌(Thalapathy vijay) సరసన లియో సినిమా(Leo Movie)లో నటిస్తున్నారు త్రిష. త్వరలో సెట్‌ మీదకు రానున్న అజిత్‌ సినిమాలో కూడా త్రిషనే కథానాయిక. తెలుగులో కూడా 17 ఏళ్ల విరామం తర్వాత మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి నటిస్తున్నారు. ఇప్పుడు మలయాళంలోనూ మంచి అవకాశం వచ్చింది. చాలా కాలం కిందట హే జూడ్‌ అనే మలయాళ చిత్రంలో నటించిన త్రిష ఆ తర్వాత మోహల్‌లాల్‌కు జోడిగా రామ్‌ అనే సినిమాలో నటిస్తున్నారు. మూడేళ్ల కిందట ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఇప్పుడు త్రిషకు మరో చక్కటి అవకాశం వచ్చింది. నటుడు టోవినో థామస్‌(Tovino Thomas) సరసన నటింపచేయడానికి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. త్రిష ఒప్పుకుంటే త్వరలో ఈ సినిమా పట్టాలెక్కుతుంది.

Updated On 7 July 2023 7:04 AM GMT
Ehatv

Ehatv

Next Story