ఇరవై ఏళ్లకు హీరోయిన్‌ కావడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ ఇరవై ఏళ్లుగా హీరోయిన్‌గా కొనసాగడం మాత్రం చాలా కష్టం. ఏ కొద్ది మందికి మాత్రమే ఇది సాధ్యం. చెన్నై చందమామ త్రిష(Trisha)కు ఈ అరుదైన ఘనత దక్కింది. రెండు దశాబ్దాల కిందట జోడి అనే సినిమాలో హీరోయిన్‌ సిమ్రాన్‌కు స్నేహితురాలిగా తళుక్కుమని మెరిసిన త్రిష

ఇరవై ఏళ్లకు హీరోయిన్‌ కావడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ ఇరవై ఏళ్లుగా హీరోయిన్‌గా కొనసాగడం మాత్రం చాలా కష్టం. ఏ కొద్ది మందికి మాత్రమే ఇది సాధ్యం. చెన్నై చందమామ త్రిష(Trisha)కు ఈ అరుదైన ఘనత దక్కింది. రెండు దశాబ్దాల కిందట జోడి అనే సినిమాలో హీరోయిన్‌ సిమ్రాన్‌కు స్నేహితురాలిగా తళుక్కుమని మెరిసిన త్రిష ఆ తర్వాత మూడేళ్లకు హీరోయిన్‌ అయ్యారు. మౌనం పెసియాదే కథానాయికగా ఆమెకు మొదటి సినిమా. ఆ తర్వాత వచ్చిన సామి సినిమా ఆమెను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసింది. గిల్లి సినిమా ఆమెను స్టార్‌ హీరోయిన్‌ను చేసింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అనేకం నటించారు త్రిష. మధ్యలో ఎన్నో ఆటుపోట్లు. అన్నింటినీ తట్టుకుని గట్టిగా నిలబడ్డారు త్రిష. వరుస వైఫల్యాలు వెంటాడినా ఎప్పుడూ కుంగిపోలేదు. సూపర్‌హిట్‌ సినిమాతో పరాజయాల పరంపరకు చెక్‌ పెట్టేవారు. అలాగే ఆమె ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చి ఎందుకో ఆగిపోయింది. ఈ సంఘటన త్రిష కెరీర్‌పై బలంగా పడింది. ఆమె మానసికంగా చాలా స్ట్రాంగ్‌ కాబట్టే అందులోంచి ఈజీగా బయటపడగలిగారు. లేడి ఓరియంటెడ్‌ కథా చిత్రాలు త్రిషకు అంతగా ఉపయోగపడలేదు. ఆమెకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టలేదు కూడా! అలాంటి తరుణంలో మణిరత్నం ఆమెకు సువర్ణావకాశాన్ని ఇచ్చాడు. పొన్నియన్‌ సెల్వన్ సినిమాలో త్రిషకు యువరాణి కుందవై పాత్ర ఇచ్చారు. ఆ పాత్రలో త్రిష నిజంగానే కుందనపు బొమ్మలా కనిపించారు. నటనతో కూడా మెప్పించారు. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం రెండు భాగాలు హిట్‌ కావడంతో త్రిష పేరు మరోసారి మారుమోగింది.ఈ సినిమా తర్వాత త్రిషకు వరుస అవకాశాలు రాసాగాయ. వరుసగా స్టార్‌ హీరోలతో కలిసి నటించే చాన్స్‌ దక్కింది. ఇటీవల దళపతి విజయ్‌తో కలిసి నటించిన లియో సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయ్యంది. మరో అగ్రకథనాయకుడు అజిత్‌తో కలిసి విడాముయర్చి సినిమాలో నటిస్తున్నారు త్రిష. ఆ తర్వాత లోకనాయకుడు కమలహాసన్‌ సరసన నటించే అదృష్టం త్రిషకు లభించింది. కమల్‌ హాసన్‌ 224వ చిత్రంలో ఈమెనే ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వం వహిస్తున్నారు. కమలహాసన్‌తో పాటు ఈ సినిమాలో మరో హీరో (Kamal Haasan) కూడా నటిస్తున్నారు. అలా మరో మల్టీ స్టారర్‌ చిత్రంలో నటించే అవకాశం త్రిషను వరించింది.

Updated On 8 Nov 2023 1:03 AM GMT
Ehatv

Ehatv

Next Story