చెన్నై చందమామ త్రిష(Trisha) మీడియాపై(Media) విరుచుకుపడ్డారు. నిజమేమరి.. అడ్డమైన రాతలు రాస్తూ ఉంటే ఎవరికైనా మండిపోవడం సహజమే! దేశంలో మరో సమస్య లేనట్టు, మరో వార్తే లేనట్టు త్రిష వయసు(age) గురించి చర్చ పెడితే ఆమెకే కాదు, ఆ వార్త చదివే మనకు కూడా చిర్రేత్తుకొస్తుంది. వయసుకు సంబంధించిన పిచ్చి రాతలు రాస్తున్న వారికి త్రిష ఎలా గడ్డి పెట్టారంటే.. ' ఇప్పుడు నా వయసు జాతీయ సమస్యగా(National Isuue) మారింది. నాకు నలభై నిండటంతో దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలయ్యింది.

Trisha Krishnan
చెన్నై చందమామ త్రిష(Trisha) మీడియాపై(Media) విరుచుకుపడ్డారు. నిజమేమరి.. అడ్డమైన రాతలు రాస్తూ ఉంటే ఎవరికైనా మండిపోవడం సహజమే! దేశంలో మరో సమస్య లేనట్టు, మరో వార్తే లేనట్టు త్రిష వయసు(age) గురించి చర్చ పెడితే ఆమెకే కాదు, ఆ వార్త చదివే మనకు కూడా చిర్రేత్తుకొస్తుంది. వయసుకు సంబంధించిన పిచ్చి రాతలు రాస్తున్న వారికి త్రిష ఎలా గడ్డి పెట్టారంటే.. ' ఇప్పుడు నా వయసు జాతీయ సమస్యగా(National Isuue) మారింది. నాకు నలభై నిండటంతో దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలయ్యింది. వీళ్లు రాసే రాతలు, వీడియోలు అలాగే ఉన్నాయి మరి. వేరే సమస్య లేనట్టు చివరకు నా వయసు గురించి చెత్త రాతలు రాయడమేమిటి? మీకు సిగ్గనిపించడం లేదా?' అని సోషల్ మీడియాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన వయసు గురించి ఈ మధ్యన సామాజిక మాధ్యమాలలో కొందరు చేసిన వ్యాఖ్యలకు త్రిష ఈ విధంగా స్పందించారు. 'బుద్ధిలేనివాళ్లు చేసే పిచ్చిపనులు ఇవి. ఇలాంటి చెత్త రాతలను మొదట్లో పట్టించుకోకూడదనే అనుకున్నాను. కానీ ఆ చెత్త రాతలు ఆగేలాలేవు. అందుకే రియాక్టవ్వాల్సి వచ్చింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 40 ఏళ్లు దాటిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. నేను మొట్టమొదటి కథానాయికనేం కాదు. ఇప్పటికీ నాకు అవకాశాలు రావడం కొందరికి ఈర్షగా , కంటగింపుగా ఉన్నట్టుంది. అందుకే పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు. నేను నటిని.. ఆఖరిశ్వాస ఉన్నంతవరకు నటిస్తూనే ఉంటాను. నటనకు వయసుకు సంబంధం ఏమిటి? ఆ మాత్రం తెలివి లేకపోతే ఎలా? నా అందం, నా నటనా పటిమ నాకు గర్వకారణాలు' అంటూ త్రిష భావోద్వేగానికి లోనయ్యారు.
