ఆ మధ్యన నటి త్రిషపై(Trisha) నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Mansoor Alikhan) అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా పరిశ్రమ అంతా త్రిషకు మద్దతుగా నిలవడంతో గత్యంతరం లేక మన్సూర్‌ అలీఖాన్‌ క్షమాపణలు చెప్పాడు. లియో(Leo) సినిమాలో త్రిషను రేప్‌ చేసే అవకాశం తనకు రాలేదంటూ మీడియా ముందు వెటకారపు మాటలు మాట్లాడాడు మన్సూర్‌. మెగాస్టార్‌ చిరంజీవితో(Chiranjeevi) పాటు చాలా మంది ప్రముఖులు మన్సూర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిచారు.

ఆ మధ్యన నటి త్రిషపై(Trisha) నటుడు మన్సూర్‌ అలీఖాన్‌(Mansoor Alikhan) అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా పరిశ్రమ అంతా త్రిషకు మద్దతుగా నిలవడంతో గత్యంతరం లేక మన్సూర్‌ అలీఖాన్‌ క్షమాపణలు చెప్పాడు. లియో(Leo) సినిమాలో త్రిషను రేప్‌ చేసే అవకాశం తనకు రాలేదంటూ మీడియా ముందు వెటకారపు మాటలు మాట్లాడాడు మన్సూర్‌. మెగాస్టార్‌ చిరంజీవితో(Chiranjeevi) పాటు చాలా మంది ప్రముఖులు మన్సూర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిచారు. కోర్టు కూడా మన్సూర్‌ను తిట్టిపోసింది. ఈ సంఘటన మర్చిపోకముందే మరో గలీజు ఘటన వెలుగులోకి వచ్చింది. అన్నాడీఎంకే(DMK) బహిష్కృత నాయకుడు ఎ.వి.రాజు(AV Raju), త్రిషపై జుగుస్సాకరమైన వ్యాఖ్యలు చేశాడు. 'ఒకానొక సమయం గౌవత్తూరులో జరిగిన ఫంక్షన్‌కు త్రిష హాజరయ్యింది. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే త్రిషపై మనసు పారేసుకున్నాడు. ఒక రాత్రికి పాతిక లక్షల రూపాయలు ఇచ్చి త్రిషతో గడిపాడు. అందుకు నేనే సాక్ష్యం' అని రాజు అన్నాడు. రాజు చేసిన గలీజు మాటలు త్రిష అభిమానులకు కోపం తెప్పించింది. అతడిపై ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ విషయం త్రిష వరకు వెళ్లింది. ఆమె కూడా దీనిపై సీరియస్‌గా స్పందించారు. నలుగురి దృష్టిని ఆకర్షించడానికి కొందరు ఎంత నీచానికైనా దిగజారుతున్నారని త్రిష అన్నారు. అతడిపై లీగల్‌ చర్యకు దిగుతానని, ఇకనుంచి ఈ అంశానికి సంబంధించి ఏం మాట్లాడాలన్నా తన లీగల్‌ టీమ్‌ మాట్లాడుతుందని త్రిష చెప్పారు. సుదీర్ఘ కాలంగా స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు త్రిష. యువ హీరోయిన్లకు పోటీగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆమె మెగాస్టార్‌ చిరంజీవి, దళపతి విజయ్‌ సరసన నటిస్తున్నారు. ఇలాంటి సమయంలో త్రిషపై పనిగట్టుకుని కొందరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. త్రిషకు రాజకీయ నేపథ్యం లేకపోవడం, ఆమె వెనక బలమైన వ్యక్తులు లేకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని ఆమె అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

Updated On 21 Feb 2024 1:48 AM GMT
Ehatv

Ehatv

Next Story