నాలుగుపదుల వయసులోనూ నవ జవ్వనిలా అందంగా కనిపిస్తున్న త్రిష(Trisha) ఇప్పుడు వరుస సినిమాలో బిజీగా ఉన్నారు.

నాలుగుపదుల వయసులోనూ నవ జవ్వనిలా అందంగా కనిపిస్తున్న త్రిష(Trisha) ఇప్పుడు వరుస సినిమాలో బిజీగా ఉన్నారు. పొన్నియన్‌ సెల్వన్‌ (Ponniyin Selvan)సినిమా తర్వాత త్రిషకు అనేక అవకాశాలు వస్తున్నాయి. పెద్ద హీరోలతో నటిస్తున్నారు త్రిష. ఇక ప్రభాస్‌(Prabhas)-త్రిష కాంబినేషన్‌ సంగతి చెప్పనే అక్కర్లేదు. వారికి హిట్‌ పెయిర్‌. ఇద్దరు కలిసి వర్షం(Varsham), బుజ్జిగాడు(Bujjigadu), పౌర్ణమి (Pournami) వంటి సినిమాలలో నటించారు. ముఖ్యంగా వర్షం సినిమాలో ప్రభాస్‌, త్రిష జోడి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఈ జంట ప్రేక్షకులకు కనువిందు చేయడానికి సిద్ధమవుతోంది. సందీప్‌రెడ్డి వంగా(sandeep Reddy Vanga)దర్శకత్వంలో ప్రభాస్‌ స్పిరిట్‌ అనే సినిమాలో నటించబోతున్నారు. ఈ విషయం పాతదే! ఇందులో ప్రభాస్‌ పోలీసు పాత్రలో కనిపిస్తారట. ఇక ఈ సినిమాలో త్రిషను హీరోయిన్‌గా తీసుకుంటున్నారట! ఈ విషయంపై త్రిషను అప్రోచ్‌ అయితే ఆమె కూడా ఓకే చెప్పారట! దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రావచ్చు. ఈ ఏడాది చివరలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న స్పిరిట్‌ సినిమా ప్రభాస్‌కు మంచి పేరు తేవడం గ్యారంటీ అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. ఇటీవలే త్రిష బృంద అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఇందులో ఆమె నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.

ehatv

ehatv

Next Story