యానిమల్(Animal) సినిమాతో అందరి దృష్టిలో పడిన నటి తృప్తి దిమ్రి(Tripti dimri).
యానిమల్(Animal) సినిమాతో అందరి దృష్టిలో పడిన నటి తృప్తి దిమ్రి(Tripti dimri). యానిమల్ కంటే ముందు పలు హిందీ సినిమాల్లో నటించినప్పటికీ యానిమల్ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు తృప్తి దిమ్రి. ఇప్పుడామె వరుస అవకాశాలతో బిజీ అయ్యారు. యాడ్స్, ఈవెంట్స్ ఛాన్స్‌లు కూడా ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే ఓ ఈవెంట్‌కు వస్తానని చెప్పి లక్షల రూపాయలు తీసుకుని తర్వాత హ్యాండ్ ఇచ్చిందట! జైపూర్‌కు చెందిన మహిళా వ్యాపారవేత్తలు ఎఫ్‌ఐసీసీఐ ఎఫ్‌ఎల్‌ఓ ఆధ్వర్యంలో ఓ ఈవెంట్‌ను కండక్ట్ చేశారు. దీనికి హాజరవుతానని చెప్పి తృప్తి దిమ్రి అయిదున్నర లక్షల రూపాయలు తీసుకుందట! ఈవెంట్ మొదలవడానికి అయిదు నిమిషాల ముందు వరకు ఇదిగో అదిగో వచ్చేస్తున్నానంటూ చెబుతూ వచ్చిందట! ఈవెంట్ ముగిసే వరకు నిర్వాహకులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆమె మాత్రం రాలేదు. దాంతో వారికి తృప్తి దిమ్రిపై కోపం వచ్చేసింది. ఆమె ఫోటోపై నల్లని పెయింట్ పూసి తమ కోపం చల్లార్చుకున్నారు. తృప్తి దిమ్రి ప్రవర్తన బాగోలేదని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్వాహకురాలు చెప్పారు. జైపూర్‌లో ఆమె నటించిన సినిమాలను బ్యాన్ చేస్తామని అన్నారు. దీనిపై తృప్తి దిమ్రి ఏమంటుందో చూడాలి.