సందీప్‌రెడ్డి వంగా(Sanreddy vanga) తీసిన యానిమల్(Animal) సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి త్రిప్తి డిమ్రీ(Tripti dimri)..
సందీప్‌రెడ్డి వంగా(Sanreddy vanga) తీసిన యానిమల్(Animal) సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి త్రిప్తి డిమ్రీ(Tripti dimri).. అందులో కొంచెం ఘాటైన సన్నివేశాలలోనే నటించింది. సినిమాలో ఓవర్ ఎక్స్‌పోజింగ్ ఉందన్న విమర్శలను కూడా ఎదుర్కొంది. ఆమెకు ఊహించని ప్రశ్న ఒకటి ఎదురయ్యింది. ఆ ప్రశ్న ఆమెను బాధపెట్టింది కూడా! అందుకే జవాబు కూడా అదే డోసులో ఇచ్చింది త్రిప్తి డిమ్రీ. యానిమల్, బ్యాడ్ న్యూస్ వంటి సినిమాలలో ఘాటైన సన్నివేశాలలో అర్థనగ్నంగా నటించిన త్రిప్తి డిమ్రీని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అని ఎక్స్‌లో(twitter) ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు త్రిప్తి డిమ్రీ ఇచ్చిన సమాధానం శభాష్ అనిపించుకుంది. ఆమె ఏమని జవాబు ఇచ్చిందంటే 'మరి నాతో అర్థనగ్నంగా నటించి, లిప్ కిస్సులతో రెచ్చిపోయిన రణబీర్ కపూర్(Ranbir kapoor) క్యారెక్టర్‌ను ఎందుకు తిట్టరు? అతడు మగాడనా? అంటే మగాడు ఎలాగైనా చేయొచ్చు. ఏమైనా చెయొచ్చు. క్యారెక్టర్ కోసం ఆడవాళ్లు చేస్తే అది పాపం!?. ఎక్స్‌పోజింగ్ సన్నివేశాల్లో నటించినంత మాత్రాన నిజ జీవితంలోనూ అలాగే ఉంటామని ఎలా జడ్జ్ చేస్తారు? ఏది చూడాలో.. ఏది చూడకూడదో ఎంచుకునే హక్కు ప్రేక్షకులకు ఉంది. అంతేకానీ ఒకరిని దూషించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. మగాళ్లను ఒకలా, ఆడవాళ్లను ఒకలా చూడటం మానుకోండి. సినిమాలలో రొమాన్స్ చేయడంలో ఆడా, మ ఇద్దరిదీ సమాన పాత్ర అని తెలుసుకోండి.’ అంటూ నెటిజన్ నోరుమూయించింది త్రిప్తి డిమ్రీ.!